సంయుక్త మీనన్ చీరకట్టులో గోల్డెన్ బ్యూటీ.. కత్తిలాంటి చూపులతో దోచెనమ్మ కుర్రాళ్ల మది

- Advertisement -

మలయాళ కుట్టి సంయుక్త మీనన్ టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎంట్రీ నుంచి విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస హిట్లు కొడుతోంది. హ్యాట్రిక్ కొట్టిన ఈ బ్యూటీ టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీగా నిలిచిపోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఈ భామ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు ఇటీవల ఈ భామ చేస్తున్న పనులకు కూడా తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. గోల్డెన్ బ్యూటీయే కాదు.. ఈ బ్యూటీది బంగారంలాంటి మనస అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

సంయుక్త మీనన్
సంయుక్త మీనన్

ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో సంయుక్త టాప్లో ఉంది. సోషల్ మీడియాలోనూ సంయుక్త జోరు కొనసాగుతోంది. ఇటీవలే విరూపాక్ష సినిమాతో థియేటర్లలో సందడి చేసి భారీ హిట్ను సొంతం చేసుకున్న సంయుక్త .. ఆ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేయడంలో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ డిఫరెంట్ ఔట్ఫిట్స్లో సందడి చేస్తోంది.

అయితే విరూపాక్ష ప్రమోషన్స్ కోసం సంయుక్త ట్రెడిషనల్ ఔట్ఫిట్స్నే ఎంచుకుంటోంది. ముఖ్యంగా చీరలో ఈ భామ ఎంతో అందంగా కనిపిస్తోంది. తాజాగా ఈ భామ చీరకట్టులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అవి కాస్త క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. సంయుక్త తాజాగా లైట్ బ్లూ కలర్ చీరకట్టులో సందడి చేసింది.

- Advertisement -

ఈ చీరలో సంయుక్త సోయగం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెడలో నెక్లెస్.. చెవికి ఝుంకాలు.. చేతికి గాజులు.. కళ్లకు కాటుకతో ఈ భామ మెస్మరైజ్ చేసింది. అంతకుమించి అలరించుకున్న క్యూట్ స్మైల్తో ఫిదా చేసింది. చీరకట్టులో సంయుక్త హొయలు చూసి కుర్రాళ్లు మతిచెడిపోతున్నారు. సంయూ బేబి ఎంత అందంగా ఉన్నావ్ అంటూ కొంటె కామెంట్లు చేస్తున్నారు. హార్ట్ ఎమోజీస్ పంపిస్తూ సంయుక్తపై తమ ప్రేమను కురిపిస్తున్నారు.

సంయుక్త టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే ఈ భామ మహేశ్ బాబుతో ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట. ఇదే బంపర్ ఆఫర్ అనుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మరో సినిమాలో కూడా అవకాశం దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ ఇద్దరు హీరోలతో కూడా హిట్ పడితే ఇక టాలీవుడ్లో సంయుక్తకు ఎదురే ఉండదు అంటున్నారు ఆమె అభిమానులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here