సీక్రెట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న సంయుక్త మీన‌న్‌ .. ఎవరి పేరో తెలుసా..

- Advertisement -

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగిస్తున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్‌.. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ మూవీ టీం సందడి చేస్తోంది.

సంయుక్త మీన‌న్‌
సంయుక్త మీన‌న్‌

సంయుక్త మీన‌న్ కూడా ఓ సీక్రెట్ ప్లేస్ లో టాటూ టేయించుకుంది. అది కాస్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సంయుక్త త‌న‌ వీపు పై ప‌చ్చ‌బొట్టు వెయించుకుంది. మలయాళంలో రాయించిన ఆ అక్షరాలకు అర్థమేంటో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఎట్టకేలకు ఆ అక్షరాలకు అర్థం తెలిసింది. సంచారి అని మలయాళీ పదం.. దానికి తెలుగులో బాటసారి, ప్రయాణికుడు అని అర్ధాలు వస్తాయి. నిజానికి అసంతృప్తిగా ఉన్నప్పుడు సంయుక్త‌కి ఒంటరిగా ప్రయాణాలు చేయడం బాగా అల‌వాటు అట‌. ఈ విషయం ప్రతిబింబించేలా ఆ టాటా వేసుకుంద‌ట‌. అద‌న్న‌మాట సంయుక్త టాటూ సీక్రెట్‌.

సంయుక్త మీనన్ పర్సనల్ విషయానికి వస్తే.. ఈమె 1995 సెప్టెంబర్ 11న పాలక్కడ్‌లో జన్మించింది.ఇక చదవు విషయానికొస్తే.. ఎకానమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో చేసిన అంజనా పాత్ర ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది.

- Advertisement -

మలయాళంలో యాక్ట్ చేస్తూనే.. తమిళంలో ‘కలరి’ మూవీతో పలకరించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘లిల్లీ’ అనే మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసింది. కెరీర్‌లో ఎక్కువగా మలయాళ చిత్రల్లో నటించిన సంయుక్త మీనన్.. తమిళం, కన్నడలో కొన్ని చిత్రాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పోయిన యేడాది పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ వంటి భారీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here