టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత రెండేళ్లుగా అటు వ్యక్తిగతంగా ఇటు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. మొదట ఓ డిజైనర్ తో అసభ్యకరంగా ఫొటో దిగడంతో షురూ అయిన నెగిటివిటీ ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో తన పాత్ర కాస్త బోల్డ్ గా ఉండటం.. వెనువెంటే అబార్షన్ చేయించుకుందనే పుకార్లు.. ఆ తర్వాత నాగచైతన్యతో విడాకులు.. ఇలా తన పర్సనల్ లైఫ్ లో అనేక సమస్యలు వచ్చాయి. ఇదంతా చాలదన్నట్టు అదే సమయంలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటం. ఆ వ్యాధితో చావు అంచుల వరకు వెళ్లొచ్చానని సమంత ఇటీవలే చెప్పింది కూడా. ఇలా అనేక సమస్యల్లో చిక్కుకున్న సమంత మనోధైర్యంతో.. స్నేహితుల సాయంతో ఒక్కొక్కటిగా ఆ సమస్యల్లో నుంచి బయటపడింది.
ఇక మయోసైటిస్ వ్యాధి నుంచి కూడా బయటపడ్డ సమంత నెమ్మదిగా సినిమా షూటింగుల్లో పాల్గొనడం ప్రారంభించింది. ఈ వ్యాధితో బాధ పడుతూనే యశోద, శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. యశోద ఫలితం ఒక రకంగా బాగానే ఉన్నా.. శాకుంతలం మాత్రం అట్టర్ ప్లాఫ్ అయింది. ఇక తన ఆరోగ్య సమస్యను శాకుంతలం ప్రమోషన్స్ కు ఉపయోగించుకుందనే పుకార్లు కూడా వచ్చి కాస్త నెగిటివిటీ చుట్టుముట్టింది. రెండేళ్లుగా తను ఎదుర్కొన్న అనుభవాలు.. ఆ సమయంలో తనకు తోడున్న వారి గురించి సమంత లేటెస్ట్ గా ఓ పోస్టు పెట్టింది. ముఖ్యంగా ఈ పోస్టును విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పెట్టడం.. తనతో దిగిన ఫొటోను జత చేయడంతో ప్రస్తుతం సామ్ పోస్టు బాగా వైరల్ అవుతోంది.
సమంత- విజయ్ దేవరకొండ ఈ జంట.. మహానటి సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో విజయ్.. సామ్ అంటే తనకు ఎంత ఇష్టమో చాలాసార్లు చెప్పాడు. అంతే కాదు చాలా ఈవెంట్లలో సామ్ పై తనకున్న ఇష్టాన్ని బహిరంగంగానే తెలియజేశాడు. ఇక తాజాగా ఈ జంట శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఫ్యామిలీ డ్రామా అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని యూనిట్ చెబుతుంది. ఈ సినిమా ప్రారంభమై ఏడాది దాటింది. ఈ నేపథ్యంలో సమంత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
నీ బెస్ట్ ని చూశారు, నీ వర్స్ట్ ని చూశారు. నువ్వు చివరన వచ్చింది చూశారు. నువ్వు మొదట వచ్చిందీ చూశారు. నువ్వు ఎదగడాన్ని చూశారు. అంతే ఫాస్ట్ గా పతనమవ్వడం చూశారు. ఇలా నీ లైఫ్ లో ప్రతి సందర్భంలోనూ మేమున్నామంటూ నిలిచారు. వాళ్లే నీ స్నేహితులు. అలాంటి మీతో ఈ ఏడాది ఎంత బాగా గడిచిందో
విజయ్
అంటూ వైట్ లవ్ ఎమోజీలను పంచుకుంది సమంత. ఇలా తన ప్రేమకి వ్యక్తం చేసింది. ప్రస్తుతం సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో చేసిన ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది.