డబ్బు కోసం తల్లి పాత్రలో నటించడానికి సిద్ధమైన సమంత..

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ గడుపుతోంది సమంత. ఇటీవల ఆమె నటించిన శాకుంతలం సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోగా ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత అప్పుడే తల్లి పాత్రలు నటించబోతోంది అని తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్ లో కాదు.

సమంత
సమంత

మరెవరికో కాదు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు. ఈ ఇద్దరు చేస్తున్న స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్. అయితే ప్రియాంక హాలీవుడ్ కోసం నటిస్తుండగా.. సమంత ఇండియన్ వర్షన్ లో చేస్తోంది. అయితే ఈ సిరీస్ కు సంబంధించిన హాలీవుడ్ మొదటి సీజన్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. దీనికి ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇండియన్ వర్షన్ ఇంకా రిలీజ్ కాలేదు.

samantha priyanka chopra

అయితే.. అందరూ అనుకుంటున్నట్టుగా ఇండియన్ వర్షన్, హాలీవుడ్ వర్షన్ కు రీమేక్ కాదట. ప్రీక్వెల్ అట. అంటే.. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా వరుణ్ ధావన్, సమంత కనిపించబోతున్నమాట. ఇంగ్లీష్ సిటాడెల్ లో ప్రియాంక కు ఒక తండ్రి ఉంటాడు. అతడు కూడా సిటాడెల్ ఏజెంటే, తనకూతురును ఆమె తాత దగ్గర పెంచినట్లు చెప్తాడు. ఇప్పుడు ఇండియన్ వెర్షన్ లో ప్రియాంక తల్లిదండ్రుల కథను రివీల్ చెప్పనున్నారట. 1990 కాలంలో ఈ కథ నడుస్తుందని సమాచారం. ఇక వచ్చే ఏడాది వచ్చే డయానా సీక్వెల్ అన్నమాట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here