Kisi Ka Bhai Kisi Ki Jaan బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్. ఈ సినిమా తమిళంలో వీరమ్.. తెలుగులో కాటమరాయుడిగా ఇప్పటికే ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో తెరకెకకిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్డే సల్మాన్ సరసన జోడీగా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రంలో తెలంగాణ ప్రేక్షకులను ఆకట్టుకునే బతుకమ్మ పాట వీడియో రిలీజ్ అయింది. ఈ పాటను తెలుగు ప్రేక్షకులు తెగ ప్రేమించేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఏంటమ్మా పాటను చూస్తుంటే సల్లూ భాయ్ తెలుగు ఆడియెన్స్ నే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పాటలో సల్మాన్ తో పాటు వెంకటేశ్ కూడా స్టెప్పులేశాడు. అంతే కాదు చివరలో గ్లోబల్ స్టార్.. మెగపవర్ స్టార్.. రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ముగ్గురు పసుపు రంగు లుంగీలో.. లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టారు.
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియో టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లుంగీ డ్యాన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలోని షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ వేసిన స్టెప్పులే. అయితే ఇప్పుడొచ్చిన ఈ సాంగ్‌తో ఓ నయా ట్రెండ్ సెట్ చేశారు కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ టీమ్. ఇందులోని స్టార్స్ వేసిన స్టెప్పుల గురించి ఇప్పుడు నెట్టింటంతా టాక్. ఇందులో రామ్ చరణ్ స్పెషల్ అప్పీయరెన్స్ పాటకు హైలైట్‌గా నిలిచిందని అభిమానులు సంబురాలు చేసుకంటున్నారు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘బతుకమ్మ’ అనే సాంగ్‌ను రిలీజ్ చేసింది టీమ్. ‘కె.జి.యఫ్’ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అయితే సినిమాలోని ఓ సందర్భంలో ఈ పాట పెడితే బాగుంటుందని విక్టరీ వెంకటేశ్ సలహా ఇచ్చారట. ఇక ఆ ఐడియా నచ్చిన సల్మాన్ ఖాన్ వెంటనే ఈ పాట పెట్టమని దర్శక, నిర్మాతలకు సూచనలిచ్చారట. సుమారు 200 మంది డ్యాన్సర్లతో పాటు హీరో హీరోయిన్లు ఈ పాటకు స్టెప్పులేసి అలరించారు.