Bathukamma Song : సల్మాన్ ఖాన్ చిత్రంలో బతుకమ్మ పాట.. పూజా హెగ్డే డ్యాన్స్ అదరగొట్టిందిగా.. వీడియో వైరల్..

- Advertisement -

Bathukamma Song : తెలంగాణ ఖ్యాతిని పెంచే పండుగలలో ఒకటి బతుకమ్మ..తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పాటలను ఇక్కడి ప్రజలకు ఎంతలా ఇష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బతుకమ్మ పండుగ అంటే చాలు ఆడపిల్లలు పూలు ఎంత అందంగా ఉంటాయో.. తొమ్మిదిరోజులు జరిగే బతుకమ్మ ఫెస్టివల్ లో అంతటా బతుకమ్మ పాటలే వినిపిస్తుంటాయి. ప్రస్తుతం సినిమాల ద్వారా తెలంగాణ సంస్కృతికి, పాటలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కుతోంది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచమే మనవైపు తిరిగి చూసింది. నిన్న విడుదలైన తెలంగాణ ‘దసరా’ చిత్రానికి కూడా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. ఈక్రమంలో తొలిసారిగా హిందీ సినిమాలో.. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రంలో బతుకమ్మ పాటను పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇక కొద్దిసేపటి కింద బతుకమ్మ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియో ఇప్పుడు లైకులు, షేర్స్ తో వైరల్ అవుతుంది..

Bathukamma Song
Bathukamma Song

సల్మాన్ ఖాన్ – పూజా హెగ్దే జంటగా నటిస్తున్న చిత్రంKisi Ka Bhai Kisi Ki Jaan. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో విక్టరీ వెంకటేశ్, జగపతి బాబు, షెహనాజ్ గిల్, విజేందర్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఫర్హద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ పత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈద్ కానుకగా ఏప్రిల్ 21న ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల కానుంది..దీంతో చిత్రాయూనిట్ ప్రమోషన్స్ ను మొదలెట్టేశారు..ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో చిత్రం నుంచి నాలుగో సాంగ్ ను ‘బతుకమ్మ’ పాటగా విడుదల చేశారు.

salman khan pooja hegde

అలాగే కొంత వీడియో భాగాన్ని కూడా విడుదల చేశారు. విక్టరీ వెంకటేశ్, పూజా హెగ్దే, సల్మాన్ ఖాన్ పూలపండుగ బతుకమ్మలను ఎత్తుకొని వస్తుండటం, బతుకమ్మపాటకు చిందులేయడం ఆఖట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ బతుకమ్మ సాంగ్ ను సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా నార్త్ ఆడియెన్స్ కు వినిపించడం విశేషంగా మారింది. ఈ సాంగ్ విడుదలపై ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రతీకగా నిలిచిన ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేసుకోండి ..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here