Salaar Movie Collections : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం రీసెంట్ గానే విడుదలైన మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ విషయం లో ఈ సినిమా ఇతర బాషల హీరోలకు, అక్కడి ట్రేడ్ పండితులకు వణుకు పుట్టించింది అనే చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ చిత్రాన్ని మొదటి రోజు నుండి డామినేట్ చేస్తూ వచ్చింది ఈ చిత్రం.
అంత బాగానే ఉంది కానీ, ఓపెనింగ్స్ లో వచ్చినంత ఊపు, ఫుల్ రన్ లో ఈ చిత్రం చూపించలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అందుకు కారణం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని సరిగా ఆదరించకపోవడమే. మొదటి వారం లో దాదాపుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో మాత్రం కేవలం 600 కోట్ల రూపాయలతో సరిపెట్టింది.
మన టాలీవుడ్ నుండి మరో 1000 కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా అవుతుంది అనుకుంటే, కనీసం జైలర్ మరియు లియో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని కూడా దాటలేకపోయింది ఈ చిత్రం. ‘జైలర్’ చిత్రానికి 650 కోట్లు, అలాగే ‘లియో’ చిత్రానికి 630 కోట్లు వచ్చాయి. ఇక ‘సలార్’ చిత్రానికి మాత్రం కేవలం 610 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమా ఒక్క నైజాం ప్రాంతం లో తప్ప, మిగిలిన అన్నీ చోట్ల బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం లో విఫలం అయ్యింది.
ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, దాదాపుగా 350 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. కానీ ‘సలార్‘ చిత్రానికి కేవలం 310 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపుగా 40 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట. కమర్షియల్ గా చూసుకుంటే ఈ చిత్రం యావరేజి గ్రాసర్ అని చెప్పొచ్చు.