Samantha దర్శకత్వం వహించిన ఏకైక సినిమా అదేనా..ఇన్ని రోజులు తెలియలేదుగా!

- Advertisement -

Samantha : సౌత్ ఇండియా లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత ముందు వరుసలో ఉంటుంది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో భారీ క్రేజ్ ని సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్ గా మారిన ఆమె, ఆ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయం లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మారిపోయింది. ఈమె ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే, కొంతమంది మీడియం హీరోల సినిమాల కంటే ఎక్కువ బిజినెస్ చేస్తాది.

Samantha
Samantha

అదే స్టార్ హీరో సినిమా లో ఆమె హీరోయిన్ గా చేస్తే ఆ సినిమాకి అదనంగా మరో పది కోట్ల రేంజ్ మార్కెట్ కలిసి వస్తుంది. ఈమధ్య కాలం లో ఆమె హీరోయిన్ రోల్స్ కంటే ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వస్తుంది. గత ఏడాది చాలా కాలం తర్వాత ఆమె విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం లో రెగ్యులర్ హీరోయిన్ రోల్ చేసింది.

Samantha  Photos

ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గ్రాసర్ గా నిల్చింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆమె కొంత కాలం మయోసిటిస్ ట్రీట్మెంట్ చేయించుకున్న సందర్భంగా సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతుంది. ఇదంతా పక్కన పెడితే సమంత గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేమిటంటే ఈమె గతం లో నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓ బేబీ చిత్రం లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సమంత కి దక్కిన మొట్టమొదటి హిట్ చిత్రం ఇది.

- Advertisement -
Samantha Stills

సినిమాలో ఆమె తనకి సంబంధించిన సన్నివేశాలను చాలా వరకు ఆమెనే డైరెక్టర్ నందిని రెడ్డి కి ఇంపుట్స్ ఇచ్చి మార్చుకుంది అట. అంతే కాకుండా ఆమె లేని సమయం లో చాలా సన్నివేశాలకు ఆమె దర్శకత్వం కూడా వహించింది అట. నందిని రెడ్డి తో పాటుగా ఈ చిత్రం లో సమంత అత్యధిక ఇన్ పుట్స్ ఇస్తూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తలదూర్చడం వల్లే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందని అంటుంటారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here