Salaar : ‘సలార్’ ఓటీటీ వెర్షన్ లో ఐటెం సాంగ్ జత చేయనున్నారా..? ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్!

- Advertisement -

Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కి ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఈ సినిమానే కమర్షియల్ గా హిట్ అయ్యింది. అయితే ఓపెనింగ్స్ లో వచ్చినంత ఊపు, ఫుల్ రన్ లో లేదనే చెప్పాలి. అందుకు కారణం ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే విధంగా లేకపోవడమే.

యూత్ ఆడియన్స్ కి ఒక సినిమా ఇంతా ఎంత నచ్చినా కూడా, లాంగ్ రన్ లో థియేట్రికల్ రన్ రావాలంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండాల్సిందే. ఈ సినిమాకి అదే కరువు అయ్యింది. అయితే ఈ చిత్రం మొదట్లో సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా లో కొన్ని కీలక మార్పులు చేసేందుకు రీ షూట్స్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో డిసెంబర్ 22 కి వాయిదా వేశారు.

అయితే రీ షూట్స్ చేసే సమయం లో సినిమాలోని గ్రాఫిక్స్ కి సంబంధించిన కొంత భాగం, అలాగే యాక్షన్ బ్లాక్స్ కొన్ని చేసారు. వీటితో పాటుగా ఒక ఐటెం సాంగ్ ని కూడా ఈ రీ షూటింగ్ సమయం లో చిత్రీకరించారు. ఆ సాంగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. అయితే ఆ సాంగ్ ఏమైంది?, ఎందుకు సినిమాలో పెట్టలేదు అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి.

- Advertisement -

అప్పటికే సినిమా లెంగ్త్ చాలా ఉండడం తో ఈ పాటని ఎడిటింగ్ లో తీసేశారట. కానీ త్వరలోనే విడుదల అవ్వబోయే ఓటీటీ వెర్షన్ లో మాత్రం ఈ సాంగ్ ని కచ్చితంగా యాడ్ చేస్తారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో జనవరి 12 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు వార్తలు వినిపించాయి కానీ, ఇప్పుడు దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here