Saindhav : ఒకేసారి రెండు ఓటీటీలలో ‘సైంధవ్’.. విడుదలైన రెండు రోజులకే ఇంత దారుణమా!

- Advertisement -

Saindhav : విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రం గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘సైంధవ్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఎందుకో ఈ చిత్రానికి టాక్ కి తగ్గ వసూళ్లు మాత్రం రావడం లేదు. ఆడియన్స్ మొత్తం ఇప్పుడు ‘హనుమాన్ ‘ మేనియా లో మునిగి తేలుతున్నారు. రెండు మూడు రోజుల దాకా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సేల్ అయిపోయాయి అట.

Saindhav
Saindhav

ఆ సినిమా మేనియా లో ‘సైంధవ్’ కొట్టుకుపోయింది అని అంటున్నారు. అంతే కాకుండా ‘సైంధవ్’ చిత్రం లో వావ్ అనిపించే రేంజ్ లో అయితే లేదని, ఎదో డీసెంట్ గా ఉంది, అందుకే సినిమాకి కావాల్సిన క్రేజ్ రాలేదు అని ట్రేడ్ పండితుల అంచనా. 25 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం మొదటి రోజు మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

daggubati venkatesh

సంక్రాంతి సెలవుల్లో అందరూ సినిమాలు చూడాలని ఉంటారు కాబట్టి, సైంధవ్ చిత్రానికి ఏ మాత్రం ఢోకా లేదని, కచ్చితంగా ఈ సినిమా కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అప్పుడే బయటకి లీక్ అయ్యింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 26 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ మరియు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ లోకి రాబోతుందని అంటున్నారు.

- Advertisement -

సినిమాకి అప్పటి వరకు రన్ దాదాపుగా పూర్తి అయిపోయి ఉంటుంది కాబట్టి ఓటీటీ లో విడుదల చేసుకోవడానికి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడే ఇలా ఓటీటీ విడుదల తేదీ సోషల్ మీడియా లో లీక్ అవ్వడంతో వెంకటేష్ ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here