Na Saami Ranga : నా సామి రంగ విడుదల.. భయంతో వణికిపోతున్న నాగార్జున..

- Advertisement -


Na Saami Ranga : బిగ్‌బాస్ సీజన్ 7 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యువసామ్రాట్ నాగార్జున మంచి జోరు మీద ఉన్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఆయన నటించిన సినిమా ‘నా సామి రంగ’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అయి తీరుతుందని నాగార్జున ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఓటీటీ డీల్ గట్టిగానే సెటిల్ అయినట్లు తెలుస్తోంది. సుమారు రూ.18 కోట్ల బిజినెస్ జరిగిందట. రూ.30 కోట్లకు పైగా ఓటీటీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. హాట్ స్టార్ నా సామి రంగా ఓటీటీ హక్కులను దక్కించుకుందట. ఓటీటీతో నాగ్‌కి డైరెక్ట్ లింక్ ఉండడంతో బాగానే వర్కౌట్ అయిందని టాక్. ఇదిలా ఉంటే సినిమాపై బజ్‌ ఇప్పటికీ క్రియేట్ కాలేదు. సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఎవరూ లేరు.

Na Saami Ranga
Na Saami Ranga

గుంటూరు కారం, హనుమాన్ లాంటి సినిమాల ముందు నా సామి రంగా సినిమాను ఎవరూ పట్టించుకునే అవకాశమే లేదు.. అయితే రిలీజ్ అయిన తర్వాత సినిమాపై పాజిటివ్ టాక్ వస్తే సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇక దీనికి తోడు నాగ్‌కి రీమేక్ సెంటిమెంట్ టెన్షన్ పట్టుకుంది. నాగార్జున రీమేక్‌లో నటించిన ఏ సినిమా కూడా ఇటీవల కాలంలో హిట్ కొట్టలేదు. తెలుగులో గత రెండేళ్లుగా వచ్చిన రీమేక్ సినిమాలన్నీ దాదాపు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో నాగార్జున నా సామిరంగాకి కూడా రీమేక్ సెంటిమెంట్ భయం పట్టుకుంది. లో లోపల ఆయన చాలా భయపడుతున్నారట.

అయితే ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ఈ రీమేక్ సినిమా సక్సెస్ అవుతుందా, లేదా అని ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు నెగిటివ్ ప్రచారం కూడా సినిమాపై జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే యూఎస్ లోను ప్రీమియర్ లేటుగా వేస్తున్నట్లు సమాచారం. ఏడు గంటల తరువాత ప్రీమియర్స్ పడ్డాయని తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి సినిమా పై నెగెటివిటీ రాకుండా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు నా సామి రంగ చిత్ర బృందం. చూడాలి మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. ఇక ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. మలయాళ సూపర్ హిట్ మూవీ పోరింజు మరియం జోసె.. మూవీకి ఇది రీమేక్. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here