బాలీవుడ్ స్టార్ హీరో కజిన్ తో కార్తీక్ ఆర్యన్ డేటింగ్..?

- Advertisement -

బాలీవుడ్ లో శుక్రవారం రోజున సినిమాలు రావడం.. మరో వారానికి కొత్తవి రావడం ఎంత మామూలో.. రిలేషన్ షిప్ లు మారిపోవడం కూడా అంతే మామూలు. ఈ వారం ఓ హీరో-హీరోయిన్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలొస్తాయి.. మరో వారానికి అదే జంట విడివిడిగా వేరే వాళ్లతో డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు వస్తాయి. అలా ప్రజెంట్ బాలీవుడ్ లో నడుస్తోన్న హాట్ రూమర్ ఏంటంటే.. కార్తీక్ ఆర్యన్ డేటింగ్ లైఫ్ గురించి.

ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కజిన్ పశ్మీనా రోషన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. పశ్మీనా త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. కానీ తెరంగేట్రం చేయకముందే ఈ అమ్మడు లైమ్ లైట్ లో తెగ సందడి చేస్తోంది. కార్తీక్- పశ్మీనా జంట ముంబయి వీధుల్లో తరచూ చక్కర్లు కొట్టడం అక్కడి మీడియా కంటపడుతూనే ఉంది. వాళ్లిద్దరి మధ్య ఉంది ఫ్రెండ్ షిప్ కాదు అంతకు మించి అంటూ బాలీవుడ్ మీడియా హడావుడి చేస్తోంది.

- Advertisement -

బాలీవుడ్ పార్టీలల్లో ఎక్కడ చూసినా ఈ జంట కలిసే కనిపిస్తోందని సమాచారం. దివాళీ రోజు రాత్రి కూడా ఈ జంట కలిసే ఉన్నారట. కార్తీక్ ఆర్యన్ గతంలో తన కో-యాక్టర్ సారా అలీ ఖాన్ తో రిలేషన్ లో ఉన్నాడంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారంటూ పుకార్లొచ్చాయి. ఇప్పుడు కార్తీక్-పశ్మీనా జంట చూడ్డానికి చాలా బాగుందంటూ.. కానీ ఇది నిజమో కాదో తెలియని అయోమయంలో ఉన్నామంటూ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ వీళ్లద్దరి మధ్య రిలేషన్ ఏంటో ఆ దేవుడికే తెలియాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here