Ram Charan ని తొక్కడానికి #RRR టీం ఇన్ని ప్రయత్నాలు చేసిందా.. బయటపడ్డ షాకింగ్ వీడియో

- Advertisement -

Ram Charan : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే, ఓటీటీ లో విడుదలైన తర్వాత ఈ సినిమా రీచ్ హాలీవుడ్ ని కూడా ఊపేసింది.రీసెంట్ గా ఈ చిత్రానికి హాలీవుడ్ లో ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ మరియు ‘లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్ అవార్డ్స్’ వంటి ఎంతో ప్రతిష్టాత్మక పురస్కారాలు వచ్చాయి.ఇక ‘నాటు నాటు’ సాంగ్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయ్యింది.

Ram Charan
Ram Charan

ఇది మన దేశానికే గర్వ కారణం, అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సమయం లో టైటానిక్ మరియు అవతార్ సిరీస్ వంటి వెండితెర అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కెమరూన్ ని రాజమౌళి కలిసిన సంగతి అందరికీ తెలిసిందే,ఈ సినిమా జేమ్స్ కెమరూన్ కి ఎంతగానో నచ్చిందట, రెండు సార్లు చూశాడట..ఈ విషయాన్నీ స్వయంగా రాజమౌళి తో జేమ్స్ కెమరూన్ తో మాట్లాడిన మాటలను సోషల్ మీడియా లో #RRR టీం విడుదల చేసింది.

james cameron about ram charan

అయితే ఈ వీడియో లో జేమ్స్ కెమరూన్ ఆ మాటలే కాదు, చిత్రం లోని హైలైట్ సన్నివేశాలను గుర్తు చేస్తూ రాజమౌళి ని ప్రశంసలతో ముంచెత్తాడు.. కానీ #RRR మూవీ టీం జేమ్స్ కెమరూన్ మాట్లాడిన మాటలను వక్రీకరించింది, జేమ్స్ కెమరూన్ ఇందులో ప్రత్యేకంగా రామ్ చరణ్ నటన మరియు ఆయన పాత్ర ని రాజమౌళి మలిచిన తీరుని పొగుడుతాడు, కానీ వీడియో లో ఆయన రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్న పార్ట్ వరకు సబ్ టైటిల్స్ ఆఫ్ చేసి విడుదల చేసారు.

- Advertisement -

అది వదిలితే ఎక్కడ రామ్ చరణ్ కి సోలో క్రెడిట్ వెళ్తుందేమో అని ఇలా చేసారని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో #RRR టీం పై విరుచుకుపడ్డారు.. అయితే నిజాన్ని ఎంత దాచాలనుకున్నా దాయలేరని పెద్దలు చెప్తూ ఉంటారు, #RRR విషయం లో అదే జరిగింది.. రీసెంట్ గా టైటానిక్ సినిమా రీ రిలీజ్ అయ్యింది. .ఈ సందర్భంగా జేమ్స్ కెమరూన్ రామ్ చరణ్ గురించి మాట్లాడిన మాటలు స్పష్టంగా కనిపించింది. ఆరోజు రాజమౌళి తో మాట్లాడిన మాటలనే ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు జేమ్స్ కెమరూన్, ఆ వీడియో ని మీరు క్రింద కూడా చూడవచ్చు. ఉద్దేశపూర్వకంగానే రామ్ చరణ్ ని తొక్కడానికి #RRR మూవీ టీం చీప్ ట్రిక్ ప్లే చేసిందని అందరికీ అర్థం అయిపోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here