బాలివుడ్ లో ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. మామూలుగానే ఆయన క్రేజ్ గురించి అందరికి తెలుసు.. ఇక ఆస్కార్ అందుకున్న తర్వాత అది రెట్టింపు అయ్యిందనే చెప్పాలి.. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన హాలీవుడ్ డైరెక్టర్స్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అయితే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.. ఆ సినిమా పోస్టర్ ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు.. ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి… ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

 ఎన్టీఆర్
ఎన్టీఆర్

ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటించనున్నారు.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌కు అపోజిట్ క్యారెక్టర్‌లో నటించనున్నాడు.. ఈ సినిమాలో కనిపించేందుకు ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ అందుకోనున్నాడని టాక్. మొదటి సినిమాకే చుక్కలు చూపిస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షెడ్ లలో కనిపిస్తున్నదని సమాచారం.

రెమ్యునరేషన్ గురించి అధికారికంగా ప్రకటించినప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం .. ఎన్టీఆర్ రూ . 30 కోట్లకు పై మాటే అని వార్తలు బాలివుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి . ట్రిపుల్ ఆర్ సినిమాకు 45 కోట్లు తీసుకున్నాడు.. ఇప్పుడు చేస్తున్న సినిమాలకు వంద కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది.. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న కొరటాల శివ సినిమాకు ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here