చైతన్య మాస్టర్ కుటుంబానికి రామ్ చరణ్ భారీ ఆర్థిక సహాయం..ఎంత డబ్బులిచ్చాడో తెలిస్తే చేతులెత్తి దండం పెడుతారు!

- Advertisement -

ఇటీవల కాలం లో మన అందరి హృదయాలను కలిచేసిన వార్త ‘ఢీ’ ప్రోగ్రాం ద్వారా డ్యాన్స్ మాస్టర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న చైతన్య మాస్టర్ ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన. ఢీ షో లో తనదైన డిఫరెంట్ స్టైల్ లో , విభిన్నమైన మ్యానరిజమ్స్ తో అశేష ప్రేక్షాభిమానం పొందాడు. ఆయన చివరిసారిగా ఢీ షో లో పాల్గొన్న ఎపిసోడ్ ఈ బుధవారం టెలికాస్ట్ కానుంది.

చైతన్య మాస్టర్
చైతన్య మాస్టర్

ఈ షో కి సంబంధించిన ప్రోమో ని విడుదల చెయ్యగా, అందులో చైతన్య మాస్టర్ ని చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటున్నారు. నవ్వుతూ తన తోటి డ్యాన్స్ మాస్టర్స్ తో జోకులు వేస్తున్న చైతన్య మాస్టర్, ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు అంటూ ఆయన అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.అయితే చైతన్య మాస్టర్ కుటుంబాన్ని ఢీ ఫ్యామిలీ చనిపోయిన తర్వాత పట్టించుకొన్నారో లేదో అనే విషయం పక్కన పెడితే, ఇండస్ట్రీ నుండి మాత్రం చైతన్య మాస్టర్ కి మంచి సపోర్టు వస్తుందని టాక్.

రామ్ చరణ్
రామ్ చరణ్

ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో బాధపడ్డాడట, అతని డ్యాన్స్ ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటానని, నేనే అతనిని ఒకరోజు పిలిపించుకొని మాట్లాడుదామని అనుకుంటూ ఉన్నానని,ఇంతలోపే ఇలా జరిగింది అనే విషయం తెలుసుకొని చాలా బాధేసిందని రామ్ చరణ్ తన సన్నిహితులతో అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

- Advertisement -

చైతన్య మాస్టర్ కాస్త ఓపికగా ఉంది ఉంటే , రామ్ చరణ్ సినిమాలో ఒక పాటకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ కూడా దక్కేది ఏమో, బ్యాడ్ లక్ అంటూ బాధపడుతున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా చైతన్య మాస్టర్ కుటుంబానికి రామ్ చరణ్ ఆర్ధిక సహాయం కూడా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.కేవలం ఆర్థిక సహాయం చెయ్యడం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా నన్ను అడగండి, మీకు నేనున్నాను అంటూ రామ్ చరణ్ భరోసా ఇచ్చాడట.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here