Released movies : ఈ వారం థియెటర్/ ఓటీటీ లో విడుదల అవుతున్న సినిమాలు..

- Advertisement -

Released movies : కరోనా పుణ్యమా అంటూ కొందరు సర్వం కొల్పొయారు.. మరి కొంత మంది బాగా సొమ్ము చేసుకున్నారు..అందులో సినీ ఇండస్ట్రీ లో ఎక్కువ..థియెటర్లకు జనాలు రావడం తగ్గించడంతో ఓటిటి ప్లాట్ ఫామ్ లలో ఎక్కువ సినిమాలను విడుదల చేశారు.అప్పటి నుంచి ఇప్పటి వరకూ అక్కడ సినిమాల జోరు కొనసాగుతుంది..ప్రతి వారం ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల అవుతున్నాయి. వారం వారం కొత్త సినిమాలకు కొదవ లేదు.. అయితే గత వారం విడుదల అయిన సినిమాలు మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. దాంతో ఈ వారం విడుదల కానున్న సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..

Released movies
Released movies

క్రిస్మస్ కానుకగా విడుదలైన రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజేస్ లు సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతున్నాయి.. ఈ ఏడాది ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. స్టార్ హీరోలందరూ సంక్రాంతికే బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్పటివరకు చిన్న ల సందడి కొనసాగనుంది. అలా ఈ ఏడాది చివరి వారంలో కూడా పలు చిత్రాలు ప్రేక్షుకుల తీర్పు కోరేందుకు థియేటర్లలో అడుగుపెడుతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఆసక్తికరమైన కంటెంట్తో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను అందించేందుకు ప్రముఖ ఓటీటీలు కూడా రెడీ అవుతున్నాయి..


ఈ వారం థియెటర్లలో విడుదల అవుతున్న సినిమాలు..

- Advertisement -

ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’- డిసెంబర్ 30


బిగ్ బాస్ సొహైల్ ‘ లక్కీ లక్ష్మణ్’- డిసెంబర్ 30
ఐశ్వర్య రాజేష్ ‘ డ్రైవర్ జమున’- డిసెంబర్ 30
తారకరత్న ‘S5… నో ఎగ్జిట్’ – డిసెంబర్ 30
అదే విధంగా.. రాజయోగం, అనగనగా దేవరకొండలో కొరమీను వంటి లు ఈ శుక్రవారం (డిసెంబర్ 30) థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఓటీటీ లో విడుదల అవుతున్నవి..

బటర్ఫ్లై (తెలుగు, తమిళం, మలయాళం కన్నడ): డిసెంబరు 29


ఆర్ యా పార్ (హిందీ వెబ్ సిరీస్): డిసెంబరు 30
బ్యూటీ అండ్ ది బీస్ట్ (హిందీ వెబ్ సిరీస్): డిసెంబరు 30
ది ఎల్ వరల్డ్ (హిందీ సిరీస్): డిసెంబరు 30
ఆహా..
అన్స్టాపబుల్ షో (ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్): డిసెంబరు 30
నెట్ఫ్లిక్స్ లో..
వైట్ నాయిస్ (ఇంగ్లిష్): డిసెంబరు 30
చోటా భీమ్: 15 (ఇంగ్లిష్ సిరీస్): డిసెంబరు 30

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉందని చెప్పాలి..ఆ సినిమాలు ఎలాంటి టాక్ ను అందుకుంటాయో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here