OTT Releases This Week : ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే మూవీస్ ఇవే!

- Advertisement -

OTT Releases This Week : గత వారమంతా థియేటర్‌ను చిన్న సినిమాలు ముంచెత్తాయి. ఈ వారం ఆ సందడి కాస్త తగ్గింది. మూవీ లవర్స్ ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజువల్ వండర్ అవతార్-2 సినిమాతో పాటు ఇంకా ఈ వారం థియేటర్/ఓటీటీలో ఏమేం సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయో ఓ లుక్కేద్దామా..

 విజువల్‌ వండర్‌ వచ్చేస్తోంది!

Avatar 2 OTT and Theater  Releases This Week
Avatar 2 OTT and Theater Releases This Week

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘అవతార్‌2’. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ పేరుతో డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.  మానవుల కారణంగా ‘పాండోరా’ను కోల్పోయిన నావీ తెగ ఎటు పయనించింది. సముద్రంతో అనుబంధం ఎలా ఏర్పడింది? అక్కడ వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తదితర విషయాలను ‘అవతార్‌2’లో చూపించనున్నారు.

- Advertisement -

శాసనసభ’

Avatar 2 OTT and Theater  Releases This Week
Sasanasabha

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా వేణు మడికంటి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘శాసనసభ’ . తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని సంయుక్తంగా నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌, సోనియా అగర్వాల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

అరుణ్‌ విజయ్‌ క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌

తమిళ్ హీరో అరుణ్ విజయ్ నటించిన  క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌ ‘ఆక్రోశం’.  డిసెంబరు 16న విడుదల చేస్తున్నారు. ఇందులో అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. జీఎన్‌ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్‌కి జోడీగా పలక్ లాల్వానీ నటిస్తోంది.

తెలుగులో మొదటి మోషన్‌ క్యాప్చర్‌ మూవీ

అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో-హీరోయిన్లుగా పరిచయమైన చిత్రం ‘పసివాడి ప్రాణం’. ఎన్‌.ఎస్‌.మూర్తి దర్శకుడు. తెలుగులో ఇప్పటివరకూ రాని వినూత్నమైన ‘లైవ్‌ కమ్‌ యానిమేషన్‌’ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి ‘పసివాడి ప్రాణం’లో నటించి మెప్పించిన ఇప్పటి సీరియల్‌ నటి సుజిత ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబరు 16న సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది.

శ్రీలీల కన్నడ చిత్రం ఇప్పుడు తెలుగులో..

I Love You Idiot
I Love You Idiot

విరాట్‌, శ్రీలీల, అపూర్వగౌడ కీలక పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’.  ఏపీ అర్జున్‌ దర్శకుడు. 2019లోనే ‘కిస్‌’ పేరుతో కన్నడలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిసెంబరు 17న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

విభిన్న ప్రేమకథా చిత్రం ‘సుందరాంగుడు’

కృష్ణసాయి హీరోగా.. మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘సుందరాంగుడు’ . వినయ్‌బాబు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ – ఎమ్.ఎస్.కె. ప్రమీదశ్రీ ఫిలిమ్స్ పతాకాలపై ఎమ్.ఎస్.రాజు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే!

ఆహా

ఇంటింటి రామాయణం (తెలుగు) డిసెంబరు 16

నెట్‌ఫ్లిక్స్‌

డాక్టర్‌ జి (హిందీ) డిసెంబరు 11

అరియిప్పు (మలయాళం)డిసెంబరు 16

కోడ్‌నేమ్‌: తిరంగా (హిందీ) డిసెంబరు 16

Code Name Tiranga
Code Name Tiranga

ఇండియన్‌ ప్రిడేటర్‌: బీస్ట్‌ ఆఫ్ బెంగళూర్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 16

ద రిక్రూట్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 16

జీ5

స్ట్రాంగ్‌ ఫాదర్స్‌, స్ట్రాంగ్‌ డాటర్స్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 12

డిస్నీ+హాట్‌స్టార్‌

నేషనల్‌ ట్రెజర్‌: ఎడ్జ్‌ఆఫ్‌ హిస్టరీ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 14

గోవిందా నామ్‌మేరా (హిందీ) డిసెంబరు 16

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఫిజిక్స్‌ వాలా (హిందీ సిరీస్‌)  డిసెంబరు 15

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here