Kushi Trailer : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఖుషి ట్రైలర్..

- Advertisement -

Kushi Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో చిత్రాల రీ రీలిజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యి మళ్ళీ సూపర్ టాక్ అందుకున్నాయి..ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి‘ ని న్యూఇయర్ సందర్భం గా ప్రపంచవ్యాప్తంగా ఖుషి రీ రిలీజ్ ఈ నెల 31 వ తారీఖున విడుదలకి సిద్ధం గా ఉంది..ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు..ఇది గమనించిన ఆ చిత్ర నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని లేటెస్ట్ 4K క్వాలిటీ కి మార్చి, డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ చేసి విడుదల చెయ్యబోతున్నారు.

Pawan Kalyan Kushi Trailer
Pawan Kalyan Kushi Trailer

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తుంది..ఇంత మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రీ రిలీజ్ అవుతున్న చిత్రానికి జరగడం ఇదే తొలిసారి..’బుక్ మై షో‘ లో కూడా ఈ చిత్రం లేటెస్ట్ రిలీజ్ మూవీస్ మరియు ‘అవతార్ 2’ వంటి చిత్రాలను కూడా అధిగమించి టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ చిత్ర నిర్మాతలు సరిగా చెయ్యడం లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాపోతూ వస్తున్నారు..వాళ్లకి ఉపశమనం కలిగిస్తూ ఈ సినిమా  ప్రీ రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేసారు..నిమిషానికి పైగా వ్యవధి ఉన్న ఈ ట్రైలర్ కట్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..పిక్చర్ క్వాలిటీ కూడా అదిరిపోయింది..వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్ ని అంత క్వాలిటీ వీడియో లో చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతున్నారు..ఎలాంటి అలర్ట్స్ లేకుండా సడన్ గా విడుదల చేసిన కూడా ఈ ట్రైలర్ రీచ్ అదిరిపోయింది.

- Advertisement -

కొన్ని నిమిషాల వ్యవధిలో ఉన్న ట్రైలర్ కుభారీ రెస్పాన్స్ వచ్చింది.లక్షల్లో వ్యూస్ వచ్చాయి..ఇక ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రేపు లేదా 27 వ తారీఖున ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది..ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా సినిమాలలో జల్సా నే అత్యధిక వసూళ్లతో టాప్ 1 స్థానం లో ఉంది..ఈ సినిమా కి దాదాపుగా 3 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. ఖుషి సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం యూట్యూబ్ ట్రైలర్ వ్యూస్ తో దూసుకుపోతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here