Prabhas : ప్రభాస్ తరచూ తలకు క్యాప్ ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా..?

- Advertisement -

టాలీవుడ్ బాహుబలి.. అమ్మాయిల మిస్టర్ పర్​ఫెక్ట్.. ఫ్యాన్స్​కు డార్లింగ్.. అదేనండి మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి మూవీతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఇక ఆ మూవీతో ఈ రెబల్ స్టార్ హీరో రేంజ్​ మారిపోయింది. ఒక్కసారిగా దశ తిరిగిపోయింది. ప్రతి సినిమాకు తన లుక్​ను మార్చడానికి ప్రభాస్ ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. ముఖ్యంగా డార్లింగ్, మిస్టర్​పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో, రాధేశ్యాం సినిమాల్లో ప్రభాస్ లుక్స్​కు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఫిదా అయ్యారు. ఇక లేటెస్ట్ మూవీస్​ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కెలలో కూడా ఈ హీరో డిఫరెంట్ లుక్స్​తో సందడి చేయనున్నాడు. అయితే ప్రభాస్ కొద్దిరోజులుగా ఎక్కడికి వెళ్లినా.. ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నా తలకు క్యాప్ పెట్టుకుంటున్నాడు. లేదా తలపాగా లాగా ఏదైనా క్లాత్ చుట్టుకున్నాడు. దీనివెనక ఓ సీక్రెట్ ఉందట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ కారణమేంటో మీకూ తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ స్టోరీ చదివేయండి మరి.

 

మిర్చి సినిమా వరకు ప్రభాస్ లుక్​కు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఫిదా అయ్యేవారు. ముఖ్యంగా మిర్చిలో ప్రభాస్ చాలా స్టైలిష్​గా కనిపిస్తాడు. ఫార్మల్ ఔట్​ఫిట్స్​లో కూడా సూపర్ స్టైలిష్​గా ఉండొచ్చని ప్రూవ్ చేశాడు ప్రభాస్. ఆ తర్వాత జక్కన్న డైరెక్షన్​లో వచ్చిన బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్‌లో భారీగా మార్పులు వచ్చాయి. ముఖం చాలా మారిపోయింది. సాహో మూవీలో కాస్త పర్వాలేదనిపించినా.. రాధే శ్యాం సినిమాలో మాత్రం ప్రభాస్ లుక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభాస్‌ను అలా చూసి అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.

- Advertisement -
Prabhas
Prabhas

ఈ మధ్య ప్రభాస్ ఎక్కువగా తలకు క్యాప్ పెట్టుకొనే కనిపిస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్, పోస్టర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా కార్యక్రమం ఏదైనా సరే ప్రభాస్ తలకు క్యాప్ పెట్టుకునే వస్తున్నాడు. తలకు క్యాప్ లేకుండా ప్రభాస్ కనిపించడం లేదు. ముఖ్యంగా హెయిర్ కనిపించకుండా ప్రభాస్ తన లుక్‌ను కవర్ చేస్తున్నాడు. ప్రభాస్ ఎందుకిలా చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ ఆలోచనలో పడిపోయారు. క్యాప్​తో ప్రభాస్ అందంగా లేడని కొందరు ట్రోల్ చేస్తున్నారు. అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరో ఇలా తరచూ క్యాప్ ఎందుకు పెట్టుకుంటున్నాడంటూ ఆలోచనల్లో పడ్డారు.

కృష్ణం రాజు అంత్యక్రియల్లోనూ ప్రభాస్​ క్యాప్​లోనే కనిపించాడు. ఆ తర్వాత జరగిన సంస్మరణ కార్యక్రమానికి కూడా క్యాప్‌తోనే వచ్చాడు. ఇలా ఒక్కసారి రెండుసార్లు కాదు ప్రభాస్ ఈమధ్య ఎప్పుడు బయటకు వచ్చినా ఇలా ఒక వింత క్యాప్ తోనే దర్శనమిస్తున్నాడు. క్యాప్ పెట్టుకోవడం వెనుక ఓ బలమైన కారణం ఉందట. అదేంటంటే.. ప్రభాస్ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆదిపురుష్, ప్రాజెక్టు కె, సలార్.. ఈ మూడు సినిమాల్లో మూడు డిఫరెంట్ లుక్స్​లో కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్​ బయటకు రివీల్ కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభాస్ క్యాప్​తో కవర్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here