RC15 కు ఆగని లీకుల బెడద.. మరో ఫోటో లీక్..

- Advertisement -

RC15 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఆ సినిమా తో వరల్డ్ ఫెమస్ అయ్యాడు.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. అయితే స్టార్ హీరోల సినిమాలు అంటే అంచనాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.. అదే విధంగా లీకుల బెడద కూడా ఉంటుంది..సినిమా షూటింగ్స్ టైంలో సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారతాయి. చిన్న సినిమాలకి ఇది ప్రమోషన్ లా పనికొచ్చినా పెద్ద సినిమాలకి మాత్రం నష్టమే.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా నుంచి ఓ ఫోటో లీక్ అయ్యింది.. అది కాస్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

RC15

అవుట్ డోర్ లో షూట్స్ చేస్తే లీకుల బాధ ఎక్కువగా ఉంటుందని అసలు స్టార్ హీరోల సినిమాలన్నీ ఇన్ డోర్ లోనే సెట్స్ వేసుకొని షూటింగ్ జరుపుకుంటున్నాయి. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో లీకుల బెడద మరీ ఎక్కువైపోయింది. చిన్న బడ్జెట్ సినిమాల సంగతి అటుంచితే భారీ బడ్జెట్ మూవీస్ మేకర్స్ ఎంత జాగ్రత్త పడుతున్నా ఎవరో ఒకరు సినిమాకి సంబంధించిన ఫోటోస్ ను, వీడియోలను, ఫైట్ సీన్లను, సాంగ్స్ ను సినిమా రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో లీక్ చేసేస్తున్నారు.

Ram charan
Ram charan

ఇప్పుడు చరణ్ సినిమా, శంకర్ కాంబో మూవీకి ఈ లీకుల తలపోటు తప్పడం లేదు..ఆ మధ్య రాజమండ్రి షెడ్యూల్ లో చరణ్ నటించిన కీలక సన్నివేశాల్నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి. చరణ్ తండ్రి పాత్రకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

- Advertisement -

అందులో అంజలితో చెర్రీ ఉన్న ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. ఆ తర్వాత అమృతసర్ లోని సీన్స్ కూడా లీకయ్యాయి. దీంతో షూటింగ్ చూడటానికి వచ్చిన జనం ఫోటోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తే కఠినమైన యాక్షన్ తీసుకుంటాం, ఎవరు వీటిని షేర్ చేసినా సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు తీసుకుంటాం అని దిల్ రాజు సంస్థ ప్రెస్ నోట్ రిలీజ్ చెశారు. అయినా సరే ఏదో మూల నుంచి లీక్స్ వస్తునే ఉన్నాయి.. మరి దీనికి శంకర్ ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here