Namitha హీరోయిన్ నమిత ఇంత నాజూగ్గా తయారు అయ్యిందేంటి.. లేటెస్ట్ ఫోటోలు చూస్తే తట్టుకోలేరు

- Advertisement -

Namitha కేవలం హీరోలకు మాత్రమే కాదు, హీరోయిన్స్ ని కూడా ఆరాధ్యంగా భావించే అభిమానులుంటారని కేవలం కొందరిని చూసి మాత్రమే చెప్పగలం.అలాంటి వారిలో నమిత కూడా ఒకరు.ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘సొంతం’ ద్వారా ఈమెకి ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Namitha
Namitha

తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి తదుపరి చిత్రం ఏకంగా విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరో తో ‘జెమినీ’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ నమిత కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది.ఈ సినిమా తర్వాత వెంటనే ఆమె తెలుగు లో రవితేజ తో ‘ఒక రాజు ఒక రాణి’ మరియు ‘ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

అలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నమిత కి కోలీవుడ్ లో హీరోయిన్ అవకాశాలు దక్కాయి.ఎప్పుడైతే ఆమె తమిళ సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిందో, అప్పటి నుండి ఆమె జాతకమే మారిపోయింది.తన అందచందాలతో మరియు అద్భుతమైన నటన తో అక్కడి కుర్రకారుల హృదయాలను కొల్లగొట్టింది,వాళ్ళు ఈమెను ఎంతలా ఆరాధించారంటే తమిళనాడు లో ఈమెకి దేవాలయాలు కట్టించే రేంజ్ లో అన్నమాట.అలా గతం లో కేవలం కుష్భూ కి మాత్రమే జరిగింది , తర్వాత నమిత కి మాత్రమే జరిగింది.

- Advertisement -

అయితే కాలక్రమేణా ఆమె శరీరాకృతి పెరుగుతూ పోవడం తో ఆమె క్రేజ్ తగ్గుతూ వచ్చింది,’ఏంటి ఈ అమ్మాయి ఇంత లావు అయిపోయింది’ అని అందరూ ఆశ్చర్యపోయారు.ఫలితంగా హీరోయిన్ ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి, స్టార్ హీరోలు నమిత వైపు చూడడం కూడా ఆపేసారు.కానీ వీరేంద్ర చౌదరి అనే ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లాడిన తర్వాత నమిత లో చాలా మార్పులు వచ్చాయి.

సినిమాల్లోకి మళ్ళీ తిరిగిరావాలనే కసితో ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేసి చాలా సన్నగా, నాజూగ్గా తయారు అయ్యింది.కానీ అప్పటికే స్టార్ హీరోలు మరియు స్టార్ నిర్మాతలు కొత్తగా వచ్చిన హీరోయిన్లకే ఎక్కువ మొగ్గు చూపడం తో నమిత ని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ ,అడపాదడపా చిన్న సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.అలా 2021 వ సంవత్సరం వరకు సినిమాల్లో కొనసాగిన నమిత ప్రస్తుత ఫోటోలు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి.అవి మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here