Eagle Trailer : పవర్ ప్యాక్డ్‌గా రవితేజ ఈగల్ ట్రైలర్.. హిట్ పక్కాలా ఉందిగా..

- Advertisement -

Eagle Trailer : ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత ఈగల్ పై అంచనాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా రవితేజ నయా లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈగల్ సినిమా ట్రైలర్‌ను మూవీ యూనిట్ నేడు (డిసెంబర్ 20) రిలీజ్ చేసింది. ఈగల్ మూవీ ట్రైలర్ రవితేజ మాస్ యాక్షన్, పవర్‌ఫుల్, ఎలినేషన్ డైలాగ్‍లతో ఆకట్టుకునేలా ఉంది.

Eagle Trailer
Eagle Trailer

మొత్తంగా పవర్ ప్యాక్డ్‌గా ఉంది. “తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేదెప్పుడో తెలుసా.. అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు” అంటూ అనుపమ పరమేశ్వరన్‍తో నవదీప్ చెప్పే డైలాగ్‍తో ఈగల్ ట్రైలర్ మొదలైంది. “విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఆపుతాను.. కాపలా అవుతాను. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను” అంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ ఉంది. రవితేజ, హీరోయిన్ కాప్యా థాపర్ మధ్య లవ్ ట్రాక్ కూడా ట్రైలర్లో కనిపిస్తుంది. రవితేజ యాక్షన్, డైలాగ్‍లు ఈ ట్రైలర్‌కు హైలైట్‍గా నిలిచాయి.

Ravi teja

“ఆయుధంతో విధ్వంసం చేసే వాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు” అంటూ రవితేజ చెప్పే డైలాగ్‍తో ట్రైలర్ ముగిసింది. ఒక నిమిషం 56 సెకన్ల పాటు ఉన్న ఈగల్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రంలో పత్తి రైతు పాత్రగా రవితేజ కనిపించనున్నారు. “మార్గశిరం.. మధ్యరాత్రి ఓ మొండి మోతుబరి చేసిన మారణహోమం గురించి తెలియాలి” అంటూ నవదీప్ డైలాగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక మ్యూజిక్ కూడా సూపర్ గా సెట్ అయింది. దీంతో రవితేజకు హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here