Amar deep కి 1 కోటి రూపాయిల చెక్ ఇచ్చిన హీరో రవితేజ.. కలలో కూడా ఊహించని బంపర్ ఆఫర్!

- Advertisement -

Amar deep : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అద్భుతమైన ఎంటర్టైనర్ గా నిల్చిన కంటెస్టెంట్ ఎవరు అని అడిగితె అది అమర్ దీప్ అని చెప్పడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు. మొదట్లో గేమ్ ఆడే విషయం లో కాస్త తడబడినా, ఆ తర్వాత తన తప్పులను తెలుసుకొని , ఎలాంటి మాస్క్ లేకుండా అద్భుతంగా ఆడి చివరికి టాప్ 2 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చి రన్నర్ గా మిగిలాడు. 14 వ వారం లో ప్రశాంత్ తో ఆ చిన్న గొడవ జరగకపోయ్యుంటే అమర్ దీప్ కచ్చితంగా టైటిల్ గెలిచేవాడని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

Amar deep
Amar deep

ఇదంతా పక్కన పెడితే అమర్ దీప్ మాస్ మహారాజ రవితేజ కి ఎంత పెద్ద వీరాభిమాని అనేది మన అందరికీ తెలిసిందే. నిన్న గ్రాండ్ ఫినాలే లో రవితేజ సినిమాలో అవకాశం ఇప్పిస్తాను, బయటకి వచ్చే అని నాగార్జున అడిగిన వెంటనే అమర్ దీప్ క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Amar deep Bigg boss

రవితేజ కూడా అమర్ ఫ్యానిజం ని చూసి షాక్ కి గురి అయ్యాడు. ఆ క్షణం లోనే ఆయన నా తదుపరి చిత్రం లో కచ్చితంగా నీతో కలిసి నటిస్తాను అని మాట ఇచ్చాడు. ఎదో మాటవరుసకి రవితేజ అలా అన్నాడు ఏమో అని చాలా మంది అనుకున్నారు. కానీ రవితేజ నిజంగానే తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు. అది కూడా క్యారక్టర్ ఆర్టిస్టుగా కాదు, హీరోగా.

- Advertisement -
Amar deep Ravi teja

రవితేజ ఆర్తీ క్రియేటివ్ వర్క్స్ అని ఒక బ్యానర్ ని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ ద్వారా ఆయన తన సినిమాలను మాత్రమే కాకుండా, కొన్ని చిన్న సినిమాలను కూడా నిర్మించాడు. ఇప్పుడు అమర్ దీప్ ని పెట్టి ఒక సినిమా తియ్యడానికి సిద్ధం అయ్యాడట రవితేజ. అందుకు గాను కోటి రూపాయిల చెక్ ని కూడా అమర్ ఇంటికి పంపాడట. ఇక్కడి నుండి ఆయన కెరీర్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here