Lavanya Tripathi Konidela : ఉపాసనలా మారిన లావణ్య త్రిపాఠి.. పెళ్లైన ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా అంటున్న నెటిజన్లు..

- Advertisement -

Lavanya Tripathi Konidela : ‘అందాల రాక్షసి’గా తెలుగు ప్రేక్షకులకు, తెలుగు చిత్రసీమకు పరిచయమైన త్రిపాఠి వారి ఇంటి అమ్మాయి లావణ్య. ఇప్పుడు ఆమె కొణిదెల వారి ఇంటి కోడలు. ఆ న్యూస్ తెలుగు ప్రజలకు తెలుసు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి ఇటలీలో ఈ ఏడాది నవంబర్ 1న ఏడు అడుగులు వేశారు. పెళ్లి తర్వాత తోడి కోడలు ఉపాసన రూటులో లావణ్యా త్రిపాఠి వెళుతున్నారు. అక్కను ఫాలో అవుతూ ఇంటి పేరు మార్చారు.

Lavanya Tripathi Konidela
Lavanya Tripathi Konidela

ఇప్పుడు లావణ్య త్రిపాఠీ సోషల్ మీడియా అకౌంట్స్ చూశారా? మొన్నటి వరకు ‘లావణ్య త్రిపాఠి’ అని ఉండేది. ఇప్పుడు ఆ పేరు చివర ‘కొణిదెల’ కూడా యాడ్ అయ్యింది. అవును… ఇప్పుడు ఆమె పేరు ‘లావణ్య త్రిపాఠి కొణిదెల’. ఇక నుంచి ఆమెను అలాగే పిలవాలని కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో పెద్ద కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం పెళ్లి తర్వాత తన పేరు చివర కొణిదెల ఇంటి పేరును యాడ్ చేశారు. సోషల్ మీడియాలో ‘ఉపాసన కామినేని కొణిదెల’ అని ఉంటుందన్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వాళ్ళ సినిమాలు ఏవీ విడుదల కాలేదు.

Lavanya Varun tej

వచ్చే ఏడాది ఇద్దరూ తెరపై సందడి చేయనున్నారు. ఇక హనీమూన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న ‘మట్కా’ చిత్రీకరణలో వరుణ్ తేజ్ జాయిన్ అయ్యారు. లావణ్యా త్రిపాఠి యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే… డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో ఆమెకు జోడీగా ‘బిగ్ బాస్‘ విన్నర్ అభిజీత్ నటిస్తున్నారు. అది కాకుండా మరో సినిమాకు ఆమె సంతకం చేసినట్లు తెలిసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here