Ravanasura Review : ‘రావణాసుర’ మూవీ రివ్యూ..రవితేజ మరో హిట్ కొట్టినట్టే!

- Advertisement -

నటీనటులు : రవితేజ, సుశాంత్, మేఘ ఆకాష్, అను ఇమ్మానుయేల్ , దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫైరా అబ్దుల్లా, జయరాం, సంపత్ రాజ్, రావు రమేష్, మురళి శర్మ, హైపర్ ఆది, సత్య తదితరులు.
డైరెక్టర్ : సుధీర్ వర్మ
సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్
నిర్మాతలు : రవితేజ , అభిషేక్ నామ

Ravanasura Review : క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ ఇచ్చి తన మార్కెట్ మొత్తాన్ని ఫుల్ డౌన్ చేసుకున్న రవితేజ, మళ్ళీ ‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.ధమాకా సినిమాతో సోలో గా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన రవితేజ, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఏకంగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టాడు.అలా కెరీర్ లో చాలా కాలం తర్వాత పీక్ ని ఎంజాయ్ చేస్తున్న రవితేజ,ఇప్పుడు ‘రావణాసుర’ మూవీ తో నేడు మన ముందుకొచ్చాడు.టీజర్ మరియు ట్రైలర్ చూసినప్పుడు ఆయన హ్యాట్రిక్ హిట్ కొట్టేస్తున్నాడు అని అర్థం అయ్యింది.మరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

Ravanasura Review
Ravanasura Review

కథ :

- Advertisement -

రవితేజ లాయర్ అవ్వాలనే లక్ష్యం తో సీనియర్ లాయర్ ఫైరా అబ్దుల్లా దగ్గర జూనియర్ లాయర్ గా చేరుతాడు.వీళ్లిద్దరు కలిసి మేఘా ఆకాష్ తండ్రి సంపత్ రాజ్ కేసు మీద పని చేస్తుంటారు.సంపత్ రాజ్ పై మర్డర్ కేసు ఉంటుంది, అతను నాకేమి సంబంధం లేదు,ఎవరో నన్ను కావాలని ఇరికించారు అని పోలీసుల ముందు ప్రాధేయపడుతుంటాడు.ఇంతలోపే అదే తరహా మర్డర్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి.ఈ సీరియల్ హత్యల వెనుక రవితేజ ఉన్నాడు అనే విషయం ట్విస్ట్ ద్వారా తెలుస్తుంది.ఎందుకు ఆయన ఇలా మర్డర్స్ చేస్తున్నాడు, ఇంత క్రూరంగా అతను మారడానికి కారణం ఏమిటి అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

Ravi teja
Ravi teja

విశ్లేషణ:

ప్రారంభం మొత్తం రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో నిండిపొయ్యేలా చేసాడు డైరెక్టర్ సుధీర్ వర్మ.కానీ ఆ తర్వాత నుండే థ్రిల్లర్ జానర్ లోకి మారిపోతుంది సినిమా.ఇందులో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడు.అందులో నెగటివ్ షేడ్స్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని కలుగచేస్తుంది.రవితేజ ఇది వరకు ఎన్నో ఊర మాస్ రోల్స్ చేసాడు, అందుకే ఆయనని అందరూ మాస్ మహారాజ అంటారు,కానీ ఇంత బోల్డ్ రోల్ మాత్రం ఇదివరకు ఆయన ఎప్పుడూ చెయ్యలేదని చెప్పాలి.స్టోరీ లైన్ చాలా బాగుంది, కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లే మీద ఇంకా కాస్త శ్రద్ద తీసుకొని ఉంది ఉంటే బాగుండేది అనిపించింది.క్రైమ్ సన్నివేశాలను చాలా బాగా తీసాడు.ఆడియన్స్ లో తర్వాత ఏమి జరుగుతుంది అనే ఆత్రుత కలిగించడం లో సక్సెస్ అయ్యింది.ప్రీ ఇంటర్వెల్ మరియు ఇంటర్వెల్ సన్నివేశాలు అదిరిపోయాయి.

Actor raviteja
Actor raviteja

ఇక యువ హీరో సుశాంత్ కి కూడా మంచి క్యారక్టర్ పడింది, ఇందులో ఆయన చాలా కొత్తగా కనిపించాడు, ఇక ఇందులో 5 మంది హీరోయిన్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఫైరా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, మేఘా ఆకాష్, అను ఇమ్మానుయేల్, పూజిత పొన్నాడ తదితరులు ఇందులో హీరోయిన్స్ గా నటించారు.ఇంతమంది హీరోయిన్లు ఈ సినిమాలో ఎందుకు ఉన్నారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఎదో హీరోయిన్ ని పెట్టాము కదా అని కాకుండా, ప్రతీ హీరోయిన్ కి కథలో ప్రాముఖ్యత ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్ సుధీర్ వర్మ.ఇక జయరాం మరియు రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.మురళి శర్మ, సంపత్ రాజ్ మరియు రావు రమేష్ పాత్రలు కూడా బాగున్నాయి.అయితే ధమాకా చిత్రం అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం పాటలు మరియు నేపధ్య సంగీతం,ఆ రెండు ఈ చిత్రం లో సరిగా కుదర్లేదు అనే చెప్పాలి.

చివరి మాట :

రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో డైరెక్టర్ సుధీర్ వర్మ తీసిన క్రైమ్ థ్రిల్లర్.ఆడియన్స్ కి మంచి టైం పాస్ అయ్యే మూవీ, ఈ వీకెండ్ కి ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు.

రేటింగ్ : 2.5/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here