Mahesh : జుట్టేంట్రా ఇంత పెంచేశావు… మహేష్‎తో మంజుల క్యూట్ వీడియో

- Advertisement -

Mahesh : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆ సినిమా కోసం జుట్టు బాగా పెంచుతూ, బాడీ మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇటీవల మహేష్ బాబు ఫోటోలు, వీడియోలు లీక్ అయితే మహేష్ లుక్ బాగా వైరల్ అవుతుంది. తాజాగా మరో సారి మహేష్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్లికి హాజరయ్యాడు. ఈ పెళ్ళికి ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

వాళ్లతో పాటు మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. మంజుల మహేష్ బాబుని చూడగానే ఆ జుట్టు ఏంటి ఇంత పెంచేసావు అని కామెంట్ చేశారు. దీంతో పాటు కాసేపు వీళ్లిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. మంజుల, మహేష్ నవ్వుతూ మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో మహేష్ అభిమానులు ఈ క్యూట్ వీడియోని వైరల్ చేస్తున్నారు. చాన్నాళ్లకు అక్కాతమ్ముళ్ల సరదా సంభాషణ చూసి మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

- Advertisement -
rajamouli mahesh
rajamouli mahesh

ఇది కదరా అసలైన బ్యూటిఫుల్ మూమెంట్ అంటూ అభిమానులు కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్, రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రాజమౌళి ఈ చిత్రం గురించి స్పెషల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here