బిగ్ బాస్ హౌస్ లో ‘బేబీ’ సినమా చూపిస్తోన్న రతిక.. కొత్త తలనొప్పి తెచ్చిందిగా..మూడో పవర్ అస్త్రా ఎవరికి వస్తుంది, అసలు గేమ్ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ ను ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. కానీ ఈసారి పవర్ అస్త్రా కోసం ఎవరు పోటీ పడతారు అనే విషయాన్ని అనూహ్యంగా బిగ్ బాసే డిసైడ్ చేశారు. ఒకవైపు పవర్ అస్త్రా కోసం పోటీ జరుగుతుంటే.. మరోవైపు రతిక, పల్లవి ప్రశాంత్.. ఎప్పటిలాగానే గిల్లికజ్జాలతో, గొడవలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

కొన్నిరోజుల పాటు రతిక, ప్రశాంత్ మధ్య మాటల్లేవు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ కొన్ని గొడవలు, కొన్ని గిల్లికజ్జాలతో కలిసిపోయారు. కానీ మధ్యలో ప్రిన్స్ యావర్ నలిగిపోయాడు. తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్‌లో రతిక, ప్రశాంత్‌ల మధ్య ఒక్కసారి కాదు.. పదేపదే గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్ లివింగ్ రూమ్‌లోని సోఫాలో కూర్చొని ఉండగా.. రతిక.. అక్కడికే వచ్చి నిలబడింది. ఇక్కడికి ఎందుకు వచ్చి నిలబడ్డావు అని ప్రశాంత్ అడగడంతో.. వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలయ్యింది. ‘‘నేను ఎక్కడైనా నిలబడతా.. నా ఇష్టం’’ అని రతిక అరవడం మొదలుపెట్టింది. మళ్లీ కాసేపు నువ్వు పో అంటే నువ్వు పో అంటూ వాదించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ రతికపై చేయి వేసి మరీ చెప్పాడు ప్రశాంత్.

అది నచ్చని రతిక.. నువ్వు చేయి వేసి మాట్లాడకు అంటూ బెదిరించడం మొదలుపెట్టింది. వాగ్వాదం చాలు అనుకున్న ప్రశాంత్.. అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు. వీరిద్దరూ కెమెరాల్లో పడడానికే ఇలా కావాలని గొడవపడుతున్నారని కంటెస్టెంట్స్ అనుకోవడం మొదలుపెట్టారు. ప్రశాంత్‌తో గొడవపడుతూ యావర్‌కు దగ్గరయిన రతిక.. అతడు పవర్ అస్త్రాకు అర్హుడు కాదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో యావర్.. రతిక దగ్గర నుంచి ఇది ఊహించలేదు అంటూ బాధపడ్డాడు. దీనికి ప్రేక్షకులు వెన్నుపోటు అని ముద్రవేశారు.