Vijay Antony : పాపం విజయ్ ఆంటోని కూతురుకు అది అంటే భయమట.. అసలు విషయం బయటపెట్టిన సుధ..



Vijay Antony : తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కూతురు మరణం యావత్ సినీ రంగాన్ని విషాదంలో ముంచేసిన సంగతి తెలిసింది. అంత చిన్న వయస్సులో ఆమె ఆత్మహత్య చేసుకోవడం అందరి మనసులను కలిచి వేస్తుంది. కోలీవుడ్‌లు జెంటిల్‌మ్యాన్‌గా పేరొందిన విజయ్ ఆంటోనీ ఇంట్లో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనపై సీనియర్ నటి సుధా మీడియాతో మాట్లాడారు. విజయ్ ఆంటోనీ.. తన సినిమా షూటింగ్స్‌కు ఫ్యామిలీని తీసుకొస్తారా అని ప్రశ్నించగా..

Vijay Antony
Vijay Antony

ఎప్పుడూ తీసుకురాలేదని సుధా సమాధానమిచ్చారు. తీసుకురమ్మని అందరూ చెప్తుండేవారని అన్నారు. త్వరలోనే తన ఫ్యామిలీని విజయ్ ఆంటోనీ షూటింగ్‌కు తీసుకొస్తానని మాటిచ్చారని, ఇంతలోనే ఇలా జరిగింది అంటూ సుధా ఎమోషనల్ అయ్యారు. విజయ్ ఆంటోనీ కూతురు మృతి తర్వాత తన తల్లిని కలిసినట్టుగా సుధా తెలిపారు. అసలు ఎందుకిలా జరిగిందని తనను కనుక్కున్నానని చెప్పారు. ‘‘ఆ అమ్మాయికి చీకటి అంటే భయమంట, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లేది కాదంట’’ అని సుధా అన్నారు. అలాంటి అమ్మాయికి ఇలాంటి ఎలా వచ్చిందో అని ఆందోళనపడ్డారు. అసలు ఆత్మహత్యకు కారణమేంటి అని సుధాని అడగ్గా..

కారణం ఏంటో తనకు తెలియదన్నారు. కానీ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుందని, డిప్రెషన్‌లో ఉందని మాత్రం కుటుంబ సభ్యులు చెప్పారని బయటపెట్టారు. డిప్రెషన్‌లో ఉంది కాబట్టి ఒక్క క్షణంలో అలా చేసుకోవడానికి నిర్ణయం తీసుకుందని సుధా బాధపడ్డారు. యూత్‌ ఎవరూ ఇలా చేయకూడదని, ఇది తల్లిదండ్రులకు ఎంతో బాధనిస్తుందని కోరారు సుధా. ఎవరికైనా బాధ అనిపిస్తే తల్లిదండ్రులతో షేర్ చేసుకోమని సలహా ఇచ్చారు. తల్లిదండ్రులకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరని అన్నారు.