స్ప్రింగ్ సమ్మర్ స్టైల్లో రష్మిక మందన్న.. గ్లామర్ డాల్ పోజులు అదుర్స్ అంటున్న నెటిజన్లు

- Advertisement -

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ స్ప్రింగ్ సమ్మర్ స్టైల్లో సమ్మర్ వేర్ లో పోజులిచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక లేటెస్ట్ ఫొటోల్లో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తోంది. బ్యాంగ్స్ తో ఈ భామ గ్లామర్ డాల్ లాగా అదిరిపోయింది. ఈ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి. 

 రష్మిక మందన్న
రష్మిక మందన్న

సోషల్ మీడియాలో రష్మిక హవా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తన ఫొటోషూట్స్ కు సంబంధించి ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. తాజాగా రష్మిక సమ్మర్ వేర్ ట్రెండీ ఔట్ ఫిట్స్ లో సందడి చేసింది. ఎల్లో, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఔట్ ఫిట్స్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించింది. ఈ స్టైలిష్ లుక్ లో రష్మిక పోజులు చూసి కుర్రాళ్లు స్టన్ అవుతున్నారు.

Rashmika Mandanna

రష్మిక ఇవేం పోజులు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు రష్మిక క్యూట్ పోజులు అదుర్స్ అంటూ తన ఫ్యాన్స్ సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ బ్యూటీ ఈ మధ్య ఏం చేసినా ట్రెండ్ అవుతోంది. ఇటీవలే ఈ భామ సోషల్ మీడియాలో ఓ రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో 38 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా సెన్సేషనల్ రికార్డ్‌ను నమోదు చేసింది రష్మిక మందన్న.

- Advertisement -
Rashmika Mandanna Yellow Dress photos

రష్మిక సినిమాల సంగతికి వస్తే.. ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప-2 సినిమా చేస్తోంది. అది కాకుండా నితిన్ తో కలిసి మరో మూవీలో కూడా నటించేందుకు పచ్చజెండా ఊపింది. ఇవే కాకుండా మలయాళంలో దేవ్ మోహన్ తో కలిసి రెయిన్ బో అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో ఎనిమల్ అనే చిత్రంలో రణ్ బీర్ కపూర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

Rashmika Mandanna Yellow Dress Stills
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here