నెట్టింట బాలయ్య బ్యూటీ అందాల విస్ఫోటనం.. టెంప్టింగ్ పోజులతో కుర్రాళ్లకు వలపు గాలం

- Advertisement -

ఈ మధ్య సినిమాల్లో నటించి పాపులర్ అవ్వడం కన్నా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం ఈజీగా మారిపోయింది. అందుకే అప్కమింగ్ వాళ్లే కాదు.. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఓ రేంజ్లో హిట్ సినిమాలు తీసి.. ఇప్పుడు అవకాశాలు లేక విలవిలలాడుతున్న వారంతా సోషల్ మీడియాను ప్లాట్ఫామ్గా మలుచుకుంటున్నారు. అక్కడ వీలైనంతగా అందాల ప్రదర్శన చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అలా నెట్టింట పాపులర్ అయిన వారి క్రేజ్ చూసి వారికి సినిమా అవకాశాలు వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ బాటలోనే నడుస్తోంది బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.

 ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్

ప్రగ్య కంచె సినిమాతో అరంగేట్రం చేసి తొలి సినిమాతోనే పాపులారిటీ సంపాదించుకుంది. ఈ భామ అందం, అభినయానికి తొలిచూపులోనే ఫిదా అయిన ప్రేక్షకులు ఈ బ్యూటీకి మంచి ఫ్యూచర్ ఉందని అనుకున్నారు. కానీ కంచె తర్వాత ఈ భామకు మరో అవకాశం రావడానికి చాలా సమయమే పట్టింది. ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినా ఒక్కటీ ఈ బ్యూటీకి హిట్ తీసుకురాలేకపోయింది. చాలా ఏళ్ల తర్వాత అఖండ రూపంలో ప్రగ్య కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. అఖండ తర్వాత ఈ బ్యూటీ దశ తిరిగిపోతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

Pragya jaiswal

అఖండ తర్వాత కూడా ప్రగ్యాకు అవకాశాలు రాకపోవడంతో ఈ భామ సోషల్ మీడియానే నమ్ముకుంది. అక్కడే వీలైనంత ఘాటుగా అందాల ప్రదర్శన చేస్తూ అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది. తరచూ వెకేషన్లకు వెళ్తూ బీచుల్లో బికీనీల్లో హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Pragya jaiswal photos

గ్రీన్ కలర్ లెహంగాలో ఎద అందాలను అమాంతం చూపించేస్తూ టెంప్టింగ్ పోజులిచ్చింది ప్రగ్యా. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ ఘాటు పోజులు చూసి కైపెక్కిపోతున్నారు. అవకాశాలు లేకపోతే ఇలాగే ఉంటది మరి అని కొందరు ట్రోల్ చేస్తుంటే.. మరికొందరేమో అవకాశాలు లేకపోయినా ఈ బ్యూటీ మనల్ని అలరించడం మాత్రం మానలేదంటూ ప్రగ్యాకు సపోర్ట్ ఇస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here