Rashmika Mandanna తల్లి దండ్రులకు తను అంటే ఇష్టముండదట.. ఇంటర్వ్యూలో ఏడ్చేసిన శ్రీవల్లి

- Advertisement -

Rashmika Mandanna : టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్‌లో తన సత్తా చాటుతోంది అందాల భామ రష్మిక మందన్న. కన్నడ లో కిరాక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో నాగ శౌర్య నటించిన చలో సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

rashmika-mandanna
rashmika-mandanna

గీతగోవిందం సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆతర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక దశ తిరిగింది. ఆ వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ఈ శ్రీవల్లి. పుష్ప పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ అయ్యింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. ఇప్పటికే హీరోయిన్ గా ఓ స్థాయికి వచ్చాను.. పలు అవార్డులు కూడా అందుకున్నాను.. కానీ నా పేరెంట్స్ మాత్రం నన్ను చూసి గర్వపడటం లేదు. దానికి కారణం వారికి సినిమా రంగం గురించి ఏమి తెలియక పోవడమే అని తెలిపింది. వృత్తి గురించి వారికి పూర్తిగా అవగాహన లేకపోయినా తనకు అవసరమైనదంతా చేసి పెడుతున్నారని తెలిపింది.అయితే కెరీర్ స్టార్టింగ్ లో తన తన తల్లిదండ్రులు పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారని, వారు పడ్డ కష్టాలు తనకు తెలుసు అని ఎమోషనల్ అయ్యింది రష్మిక. అందుకే తన పేరెంట్స్ గర్వపడేలా మరింత సాధించాలని అనుకుంటున్నానని చెప్పింది.

- Advertisement -
Rashmika Mandanna Comments

ఇక ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప2తో పాటు లేడి ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ ‘‘లేడి ఓరియంటెడ్‌ సినిమాలో మొదటిసారి నటిస్తున్నాను. ఇలాంటి పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

‘రెయిన్‌ బో’ కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. ఇది ఓ క్రేజీ రైడ్‌లా ఉంటుంది’’ అని చెప్పింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలవ్వనుంది. అయితే, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసింది. 2021లో సమంత (Samantha) కు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here