Rashmika Mandanna : కన్నడలో బ్యాన్​పై రష్మిక కామెంట్స్​.. అది చెప్పాల్సిన అవసరం లేదంటూ..

- Advertisement -

కన్నడ సినిమా ఇండస్ట్రీ తనపై నిషేధం విధించిందన్న వార్తలపై నేషనల్ క్రష్​ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) స్పందించింది. ఆ వార్తల్ని ఖండిస్తూ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని క్లారిటీ ఇచ్చింది. కాంతారా మూవీపై కామెంట్స్, తనకు ఫస్ట్ మూవీ ఆఫర్ ఇచ్చిన బ్యానర్​ గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే.”

Rashmika Mandanna
Rashmika Mandanna

కాంతార‘ సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిత్రం చూశాక బృందానికి నేను మెసేజ్‌ పెట్టా. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు కూడా బయటకు రిలీజ్‌ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత” అని రష్మిక స్పష్టం చేసింది.

Actress Rashmika Mandanna
Actress Rashmika Mandanna

కొన్ని రోజుల క్రితం.. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌కు రష్మిక ఇంటర్వ్యూ ఇచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని, పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిందని చెప్పింది. అయితే, తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి చూపించలేదంటూ పలువురు కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -
Actress Rashmika Mandanna Photos

ఆమె నటించిన తొలి చిత్రం ‘కిరిక్‌ పార్టీ’ని పరంవా నిర్మించగా ‘కాంతార’ ఫేం రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. దాంతో, ఈ ఇద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చాయని, ఎంతోమంది ప్రముఖులు ‘కాంతార’ను ప్రశంసించినా ఆమె ఏం మాట్లాడకపోవడానికి కారణం అదేనంటూ ఆరోపించారు.

Actress Rashmika Mandanna Images

కృతజ్ఞతాభావంలేని ఆమెను బ్యాన్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో చర్చకు తెరలేపడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కొన్ని రోజుల క్రితం ‘టాక్‌ ఆఫ్ ది టౌన్‌’గా మారడంతో తాజాగా ఆ వ్యాఖ్యలకు రష్మిక చెక్ పెట్టింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి. రష్మిక ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్​లో బిజీగా ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here