Rashmika Mandanna : అవును.. విజయ్ కోసమే అలా చేశా.. అయితే ఏంటిప్పుడు..?

- Advertisement -

Rashmika Mandanna : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంటారు కథానాయికలు. ఈ క్రమంలో కొన్నిసార్లు వర్కవుట్ కావు అనిపించిన సినిమాలు కూడా చేస్తారు. మరికొన్ని సార్లు తమకు నచ్చిన పాత్ర వచ్చిందని చేసేస్తారు.  తాము సాధారణ ప్రేక్షకులుగా.. అభిమానులుగా ఉన్నప్పుడు ఎంతో ఆరాధించిన హీరోలతో.. హీరోయిన్ అయ్యాక నటించే ఛాన్స్ వచ్చినప్పుడు కథ.. కంటెంట్.. ఇలా ఏం చూసుకోకుండా ఓకే చెప్పేస్తారు.

Rashmika Mandanna
Rashmika Mandanna

అక్కడ ఆ హీరోయిన్ తన కెరీర్.. ఇండస్ట్రీలో తన లైఫ్ స్పాన్ గురించి ఆలోచించదు. తన ఫేవరెట్ హీరోతో నటించానలనే చిరకాల కోరిక నెరవేరితే చాలు.. ఇంకేం వద్దు అనుకుంటుంది. ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు కూడా అలాంటి అవకాశమే వచ్చింది. అందుకే రష్మిక కూడా తన ఫేవరెట్ హీరోతో నటించే ఛాన్స్ రాగానే ముందూ వెనక ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. ఆ సినిమాయే వారసుడు.. ఆ హీరో తమిళ్ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్.

విజయ్‌ ‘వారిసు’లో తన పాత్రకి కేవలం రెండు పాటలు తప్ప.. నటించడానికి ఏమీ లేదని రష్మిక ఒప్పేసుకుంది. విజయ్ కోసమే తాను ఆ స్క్రిప్ట్‌ ఓకే చేసినట్లు చెప్పేసింది. తాజాగా ఓ ఆంగ్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమెను..‘‘వారిసు’లో మీ పాత్రకు ఎలాంటి స్కోప్‌ లేనప్పటికీ ఎందుకు ఓకే చేశారు?’ అని విలేకరి ప్రశ్నించింది.

- Advertisement -

‘‘అవును. అయితే, ఈ కథను ఓకే చేయడమనేది పూర్తిగా నా సొంత నిర్ణయం. ఇష్టప్రకారమే దాన్ని ఓకే చేశాను. విజయ్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాలో నటించాను. అందులో నా పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని, కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు. అయితే ఆ రెండు పాటల్లోనూ అదరగొట్టేయాలనుకున్నాను. ఇదే విషయాన్ని సినిమా షూట్‌లో ఉన్నప్పుడు విజయ్‌ సార్‌ వద్దకు వెళ్లి సరదాగా చెబుతుండేదాన్ని. ‘సినిమాలో నేను చేయడానికి కేవలం పాటలు తప్ప ఏమీ లేదు సర్‌’ అని జోక్స్‌ వేసేదాన్ని.‘‘ అని రష్మిక చెప్పింది.

‘‘అన్నీ నాకు తెలిసి  చేసినవే. ఒక నటిగా సినిమా సెట్‌కు వెళ్లి, ఇతరులతో కలిసి పని చేయడం ద్వారా వారి నుంచి చిన్న చిన్న విషయాలను కూడా నేర్చుకునేదాన్ని. నాకు నటించేందుకు పెద్దగా అవకాశం లేకపోయినా, ఇందులో భాగస్వామిని కావాలని అనుకున్నా. ఒక నటిగా అన్ని పాత్రలు నేను చేయాలి. అందుకే ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటించా. నా వరకూ నేను సంతృప్తిగానే ఉన్నాను’’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వారిసు’. దిల్‌ రాజు నిర్మాత. ఇదే చిత్రాన్ని ‘వారసుడు’ పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. వారిసు మూవీలో తన పాత్రకు పెద్ద స్కోపు లేకపోయినా ‘జిమిక్కి పొన్ను’, ‘రంజితమే’ పాటల్లో రష్మిక అదరగొట్టింది.

ఇక మరోవైపు రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్‌ మూవీ ‘మిషన్‌ మజ్ను’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో పాటు రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘యానిమల్‌’తో పాటు, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్‌’ లోనూ రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి జరిగే షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here