Namratha Shirodkar : కొడుకు చేసిన పనికి బాధ పడుతున్న మహేష్ బాబు భార్య నమ్రత



Namratha Shirodkar : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. టాలీవుడ్​లో ఫ్యామిలీ హీరో అంటే గుర్తొచ్చేది మహేశ్ బాబే. ఫ్యామిలీ హీరో అంటే కుటుంబ కథా చిత్రాలు తీసేవాడని కాదు ఇక్కడ అర్థం. ఫ్యామిలీ మ్యాన్ అని. సినిమాలు, ప్రమోషన్స్​తో ఎప్పుడు బిజీగా ఉండే మహేశ్ బాబు కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తాడు. అందుకే తరచూ ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్​కి వెళ్తుంటాడు.

Namratha Shirodkar
Namratha Shirodkar

మహేశ్ బాబు విదేశాల్లో షూటింగ్ ఉందంటే.. అక్కడికి తప్పక తన ఫ్యామిలీతోనే వెళ్తాడు. భార్య నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్ కుమార్, కూతురు సితార. అందరూ కలిసి హాయిగా జాలీగా హాలిడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సితార గురించి తెలిసిందే.. చాలా చలాకీ పాప. సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్​గా ఉంటుంది. రీసెంట్​గా వచ్చిన సర్కారు వారి పాటలో ఓ సాంగ్​లో స్పెషల్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది. అప్పుడప్పుడు క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్ చేసి వీడియోలు పోస్టు చేస్తూ ఉంటుంది.

Namratha with Sitara and gautham
Namratha with Sitara and gautham

కానీ గౌతమ్ కాస్త డిఫరెంట్. చాలా సైలెంట్​గా ఉంటాడు. మెతక మనిషి అని చూస్తేనే అర్థమవుతుంది. ఇక గౌతమ్ కూడా సోషల్ మీడియాలో ఉంటాడు కానీ.. ఎక్కువ యాక్టివ్​గా ఉండడు. ఇటీవలే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. మహేశ్-నమ్రతలు గౌతమ్ విషయంలో చాలా ప్రొటెక్టివ్​గా ఉంటారు. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడే నమ్రత చాలా ఎమోషనల్​గా ఫీల్ అయింది. అయితే ఇప్పుడు గౌతమ్ చేసిన మరో పనికి నమ్రత చాలా బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఇంతకీ గౌతమ్ ఏం చేశాడు..? నమ్రత ఎందుకు అంతలా బాధపడుతోంది..? ఓసారి తెలుసుకుందామా..?

తన తనయుడు గౌతమ్​ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది నటుడు మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్. కల్చరల్‌ టూర్‌లో భాగంగా గౌతమ్‌ తొలిసారి సొంతంగా ప్రయాణం చేస్తున్నాడని పేర్కొన్న ఆమె.. తనకెంతో బాధగా ఉందని చెప్పారు. తన కుమారుడు తిరిగి వచ్చేవరకూ వెలితిగానే ఉంటుందని పేర్కొన్నారు.

‘‘కల్చరల్‌ ట్రిప్‌లో భాగంగా గౌతమ్‌ ‌మొదటిసారి.. సొంతంగా విదేశాలకు వెళ్లాడు. నాలోని ఓ భాగం నన్ను వదిలి వెళ్లినట్లు అనిపించింది. రోజంతా శూన్యంగా గడిచింది. తను ఇంటికి తిరిగి వచ్చి.. మా కళ్ల ముందు ఉండే వరకూ ఈ బాధ పోదు. గూడును వదిలి మా బాబు ఎగరగలుగుతున్నాడు. ఈ వారం మొత్తం సరదాలు, సంతోషాలు, సాహసాలతో గడవాలని ముఖ్యంగా ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు మరింత తెలుసుకోవాలని ఆశిస్తున్నా. ఈ ప్రయాణం నీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాగే నీ రాక కోసం ఎదురుచూస్తుంటా’’ అని నమ్రత పోస్టు చేసింది. #Teens #Independence అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను ఆమె ఈ పోస్టుకు జత చేసింది. అలాగే, సహ విద్యార్థులతో కలిసి గౌతమ్‌ దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో పంచుకుంది.