ఇండస్ట్రీలో ఎక్కడ పార్టీ జరిగినా నేను పరిగెత్తుతాను.. సీక్రెట్ చెప్పిన రానా

- Advertisement -

దగ్గుబాటి రానా నటించిన సినిమాలలో సోలో హీరోగా నటించిన సినిమాల కంటే మల్టీస్టారర్ సినిమాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. బాహుబలి సిరీస్ సినిమాలు, భీమ్లా నాయక్ రానా టాలెంట్, క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచాయి. విరాటపర్వం సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో రానా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరేషాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రానా పరేషాన్ మూవీ నటీనటులతో కలిసి ఈ షోకు హాజరయ్యారు. ప్రోమోలో రానా పేల్చిన పంచ్ లు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హల్క్ అంటూ రానా గురించి సుమ ఇంట్రడక్షన్ ఇవ్వగా స్టైలిష్ గా రానా ఎంట్రీ ఇచ్చారు.

రానా
రానా

ఈ షోలో రానా వేసిన పంచులు అందరినీ ఎంతో నవ్వించాయి. రానా, తిరువీర్‌తో కలిసి సుమ ‘బాహుబలి 2’ స్ఫూఫ్ చేశారు. అందులో బాహుబలి తల నరికిన సీన్‌ను రీ క్రియేట్ చేశారు. సుమను రానా ఏమైందని అడిగారు. ‘బిర్యానీ పొట్లం కోసం లైన్‌లో నిల్చుంటే వీడు నన్ను తాకాడు. అప్పుడే వేలు నరికేశానని చెబుతుంది. దీంతో రానా నరకాల్సింది వేలు కాదు.. బిర్యానీ ప్యాకెట్‌ను అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. ఈ పంచ్ తో షోలో నవ్వుల పువ్వులు పూశాయి. అటు ఈ షోలో రూ. 500 నోటుతో రానా చేసిన కామెడీ అందరినీ అలరించింది.

Rana SUma

ఇండస్ట్రీలో మందుపార్టీ అనగానే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్లు ఎవరు? అని సుమ అడగ్గా, ఓ బ్యాచే ఉందని తెలిపారు రానా. ఆ ముఠాకు తానే మేస్త్రీని అని చెప్పడంతో అందరూ విరగబడి నవ్వారు. మొత్తంగా ‘పరేషన్’ టీమ్ ‘సుమ అడ్డా’లో కామెడీతో సుమను పరేషాన్ చేసింది. సుమ యాంకర్‌గా చేస్తోన్న షోలలో క్యాష్ చాలా ప్రత్యేకంగా నిలిచేది. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అయింది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడిచింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here