Anchor Suma మెడ పట్టుకున్న గోపిచంద్. అసలేం జరుగుతోంది..?

- Advertisement -

Anchor Suma : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు గోపీచంద్ మొదట విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. ఆ తర్వాత రణం సినిమాతో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కూడా హీరోగానే పలు సినిమాలలో నటించారు. ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న గోపీచంద్ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. తాజాగా రామబాణం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమా అడ్డా అనే షో కి గెస్ట్ గా రావడం జరిగింది.

Anchor Suma
Anchor Suma

ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు. ఈ సినిమా వచ్చే నెల ఐదవ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా డింపుల్ హయాతి నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ సుమ హోస్టుగా చేస్తున్న సుమా అడ్డ అనే షోలోకి పాల్గొనడం జరిగింది. తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో సుమ సరదాగా పలు ప్రశ్నలతో చిత్ర బృందాన్ని బాగా వినోదం చేసింది. గోపీచంద్ పై సుమ సెటైర్లు వేస్తూ బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది మీరు హీరోయిన్ అయితే ఆ సినిమాలో నేను విలన్ గా చేస్తానన్నట్టు గోపీచంద్ సుమను ఆట పట్టిస్తూ నవ్వించారు.

Anchor Suma Gopichand

అయితే భర్త ఇంటికి ఆలస్యంగా వస్తే భార్య అలుగుతుందని సుమా చెప్పడంతో చూడని పూర్తిచేసుకుని మీరే రోజు ఇంటికి లేటుగా వెళ్తారు అంటూ మరొకసారి గోపీచంద్ పై సుమ సెటైర్ వేయడం జరిగింది. ఇక హీరోయిన్ డింపుల్ హయాతి కూడా గోపీచంద్ ని పొగడ్తలతో ముంచేస్తోంది. గేమ్ ఆడుతున్న సమయంలో హీరో గోపీచంద్ చాలా వైల్డ్ గా బిహేవ్ చేశారు ఒక్కసారిగా సుమ గొంతు పట్టుకున్నట్టుగా ఈ ప్రోమోలో తెలుస్తోంది. అయితే గోపీచంద్ అలా ఎందుకు చేశారు తెలియక అభిమానులు షాక్ అవుతున్నారు. పూర్తి ఎపిసోడ్ ఈనెల 29న ప్రసారం కాబోతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here