ఎన్టీఆర్ ఆరోజు ఆ భరోసా ఇవ్వకపోయ్యుంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయ్యేది కాదా?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియా లో ఎన్ని ఫ్యాన్ వార్స్ చేసుకున్నా, వాళ్ళు అభిమానించే హీరోలు మాత్రం నిజ జీవితం ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఎంతో మంచి స్నేహ భావం తో ఉంటారు.అలాంటి హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. ఈయనకి టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న తన తోటి స్టార్ హీరోలందరితో మంచి స్నేహం ఉంది. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఇతర హీరోలతో మాట్లాడడం చాలా తక్కువ.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

కానీ ఎన్టీఆర్ తో మాత్రం రెండు మూడు సందర్భాలలో కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా, ఎంతో సరదాగా మాట్లాడాడు. దానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.అయితే ఈ ఇద్దరు ఒకరికోసం ఒకరు నిలబడ్డ రోజులు ఉన్నాయి. ఎన్టీఆర్ దమ్ము సినిమా షూటింగ్ కోసం, బుక్ చేసుకున్న లొకేషన్ ని కూడా ఎన్టీఆర్ కి అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్టిస్టుల డేట్స్ ఉండవని, దయచేసి మీ షూటింగ్ ని ఒక మూడు రోజులు వాయిదా వేసుకోమని కోరగా పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకున్నాడు.

Pawan kalyan ntr

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘అత్తారింటికి దారేది ‘ చిత్రం ఆ రోజుల్లో విధులకు ముందే సినిమా మొత్తం HD క్వాలిటీ ప్రింట్ తో బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరూ ఈ సినిమా కోసం ఎంత సపోర్టుగా నిలబడ్డారు అనేది తెలియదు కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా సపోర్టుగా నిలబడ్డాడు.

- Advertisement -
Pawan kalyan JR ntr

నిర్మాత BVSN ప్రసాద్ కి మీరు సినిమా విడుదల చేసేయండి, మీ ఒకవేళ నష్టం కలిగితే మీకోసం ఒక సినిమా ఉచితంగా చేస్తాను అని నిర్మాతకి చెప్పాడట. అలా పవన్ కళ్యాణ్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా భరోసా ఇవ్వడం తో ఈ సినిమాని ధైర్యంగా విడుదల చేశారు . కానీ ఆ తర్వాత ఎలాంటి ఫలితం వచ్చిందో మన అందరం చూసాము, అప్పట్లోనే 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here