‘గుంటూరు కారం’ గ్లిమ్స్ వీడియో అదుర్స్.. కానీ ఎన్టీఆర్ టైటిల్ ని కాపీ కొట్టేసారుగా!

- Advertisement -

గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పేరు ‘గుంటూరు కారం’ అని కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది మూవీ టీం. ఒక గ్లిమ్స్ వీడియో తో ఊర మాస్ మహేష్ బాబు ని పరిచయం చేస్తూ అద్భుతమైన టీజర్ కట్ ని విడుదల చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

గుంటూరు కారం
గుంటూరు కారం

‘ఏంటి అలా చూస్తున్నావ్..బీడీ 3D లో కనపడిందా’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ టీజర్ లో మహేష్ బాబు స్టైల్ గా నోట్లో బీడీ కాలుస్తూ నడవడం, తొడ కొట్టినప్పుడు జీప్ గాల్లోకి పైకి లెగవడం వంటివి ఇది వరకు మహేష్ బాబు ఎప్పుడూ కూడా చెయ్యలేదు. అలాంటివి అన్నీ ఈ టీజర్ లో ఉండేసరికి ఫ్యాన్స్ సరికొత్త మహేష్ బాబు ని చూసిన అనుభూతిని పొందారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా టైటిల్ ‘గుంటూరు కారం’ క్రింద క్యాప్షన్ ‘హైలీ ఇంఫ్లేమబుల్’ అని పెట్టారు. క్యాప్షన్ అదిరింది కానీ అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘రాఖీ’ మూవీ టైటిల్ నుండి కాపీ కొట్టారని తెలుస్తుంది.ఈ టీజర్ వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయాన్నీ పసిగట్టి ట్విట్టర్ లో వెయ్యగా అది తెగ వైరల్ గా మారింది.

- Advertisement -

ఎన్టీఆర్ రాఖీ మూవీ పై సోషల్ మీడియా లో ఎలాంటి ట్రోల్ల్స్ వస్తూ ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ భయంకరమైన ట్రోల్ల్స్ వేస్తూ ఉంటారు దీనిపై. ఎవరైతే ట్రోల్ల్స్ చేసారో , ఇప్పుడు వాళ్ళే మా సినిమా టైటిల్ క్యాప్షన్ ని వాడుకున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ పై ట్రోల్ల్స్ వేస్తున్నారు. ఇది అంత పక్కన పెడితే వింటేజ్ మహేష్ బాబు ని చూసినందుకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here