ప్రభాస్ కల్కి సినిమాలో రామ్ గోపాల్ వర్మ.. షూటింగ్ కూడా అయిపోయిందా..!

- Advertisement -

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న గ్లోబల్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే భారీ తారాగణంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ చిత్రం. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్‍హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‍‍లో రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.

కాలిఫోర్నియాలో జరిగిన సాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్‍లో ఈ చిత్రం గ్లింప్స్ రిలీజ్ కాగా.. అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాగా, ‘కల్కి 2898 ఏడీ’లో కొందరి క్యామియో రోల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్‍గా ఉండనున్నాయి. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ (RGV) క్యామియో చేస్తున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా ఈ చిత్రంలో ఆయన తన షూటింగ్‍‍ను పూర్తి చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది.

‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఆర్జీవీ తన చిత్రీకరణ పార్ట్ పూర్తి చేస్తున్నారన్న సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే, ఆర్జీవీ ఈ చిత్రంలో ఏ పాత్ర చేస్తున్నారన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. మరోవైపు, దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో క్యామియో రోల్‍లో కనిపించడం దాదాపు ఖరారైంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ రేంజ్‍లో డైరెక్టర్ రాజమౌళి ఫేమస్ అయ్యారు. దీంతో ఈ చిత్రంలో ఆయన కనిపిస్తే హాలీవుడ్‍లోనూ మరింత బజ్ నెలకొంటుందని ‘కల్కి 2898 ఏడీ’ యూనిట్ భావిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here