ఏందో ఈ రచ్చ.. మళ్లీ ముద్దులతో రెచ్చిపోయిన నరేష్-పవిత్ర లోకేష్..

- Advertisement -

తెలుగు టీవీ షోలో న‌రేష్‌కు ప‌విత్రా లొకేష్ ముద్దు ఇచ్చింది. అంతేకాదు న‌రేష్‌కు తాను పెట్టిన ముద్దు పేరును కూడా ప‌విత్రా లోకేష్ రివీల్ చేసింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా స్వామి రారా పేరుతో ఈటీవీలో ఓ స్పెష‌ల్ షో టెలికాస్ట్ కానుంది. ఈ షోకు గెస్ట్‌లుగా న‌రేష్, ప‌విత్రా లోకేష్ వ‌చ్చారు. ఈ స్వామిరారా షోకు శ్రీముఖి, హైప‌ర్ ఆది హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ షోలో ప‌లువురు బుల్లితెర ఆర్టిస్ట్‌లు పాల్గొన్నారు.

actress pavitra shocking comments about marriage with naresh

ఈ స్వామిరారా సెకండ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో తొలి పూజ ఎవ‌రు చేయాల‌నే విష‌యంలో ఆర్టిస్టుల‌ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. దాంతో వారిని కంట్రోల్ చేయ‌డం మ‌న వ‌ల్ల కాదు.. ఓ సెన్సేష‌న‌ల్ క‌పుల్‌ను అరెంజ్ చేశాను అని శ్రీముఖితో బ‌ల‌గం వేణు చెప్ప‌గానే వేదిక‌పై న‌రేష్, ప‌విత్రా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ షోలో స్టేజ్‌పై గులాబీ పువ్వు ఇచ్చి ప‌విత్రా లోకేష్‌కు న‌రేష్ ప్ర‌పోజ్ చేసిన‌ట్లుగా చూపించారు. అత‌డి ప్ర‌పోజ‌ల్‌కు ఫిదా అయిన ప‌విత్రా లోకేష్…న‌రేష్ చెంప‌పై ముద్దు ఇచ్చిన‌ట్లు ప్రోమోలో క‌నిపిస్తోంది.

ఆ త‌ర్వాత న‌రేష్‌ను ముద్దుగా మీరు ఏమ‌నిపిలుస్తారు ప‌విత్రా లోకేష్‌ను శ్రీముఖి ప్ర‌శ్న అడిగింది. రాయ అని పిలుస్తాన‌ని ప‌విత్రా లోకేష్ చెప్పింది. న‌వ‌ర‌స‌రాయ అన్న‌ది న‌రేష్ బిరుదు…అందులోని రాయ తీసుకున్నారు…ఇక నుంచి నా కోసం ర‌స‌రాయ అని పిల‌వండి అంటూ న‌రేష్‌పై హైప‌ర్ ఆది సెటైర్ వేశాడు. న‌రేష్, ప‌విత్రా లోకేష్‌తో పాటు ఈ షోకు హీరోయిన్లు చాందిని చౌద‌రి, ఫ‌రియా అబ్దుల్లా కూడా గెస్ట్‌లుగా వ‌చ్చారు. ఈ ప్రోమో వైర‌ల్‌గా మారింది. న‌రేష్, ప‌విత్రా లోకేష్ చాలా కాలంగా స‌హ జీవ‌నం చేస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రు జంట‌గా న‌టించిన మ‌ళ్లీ పెళ్లి మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here