నీకు ఆ అబ్బాయిలు నచ్చలేదా.. లైవ్ లో తమన్నాను అలాంటి ప్రశ్న అడిగిన నెటిజన్..

- Advertisement -

‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఆ తరువాత హ్యాపీ డేస్ సినిమాతో యువత క్రేజ్ సంపాదించింది. తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టింది ఈ మిల్కీ బ్యూటీ. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఈ అమ్మడు నటించింది. దక్షిణాది భాషలతో పాటు, బాలీవుడ్ లోను అనేక చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ దూసుకెళ్తోంది.

తాజాగా ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న ఈ అమ్మడు.. అసహనానికి గురైంది. తన తల్లిదండ్రులే ఇలాంటి ప్రశ్నలు వేయలేదంటూ ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఫ్యాన్స్ మీట్ లో తమన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి అభిమానులతో ముచ్చటించారు. అలానే వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు. అయితే ఒక ప్రశ్నకు మాత్రం ఆమె ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేసింది.

“మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?. తమిళ అబ్బాయిలు మీకు నచ్చలేదా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై తమన్నా తీవ్ర అసహనానికి లోనయ్యారు. తన తల్లిదండ్రులే ఇలా తనను ఎప్పుడూ అడగలేదని ఈ బ్యూటీ అన్నారు. తన లవర్ విజయ్ వర్మను ఉద్దేశిస్తూ.. ప్రస్తుతం జీవితంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని, తన లైఫ్ ఆనందంగా సాగుతుందని తమన్నాచెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here