Chiranjeevi : చిరంజీవి కూడా అదే చేశాడుగా.. లుంగీ పైకెత్తి పాట పాడుతూ..



Chiranjeevi : చిరంజీవి,శృతిహాసన్, రవితేజ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య..డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించారు.జనవరి 13న రిలీజ్ అయింది. ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాపై. ఇక పాటలు, ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. నేడు సినిమా రిలీజ్ తో చిరు అభిమానులు థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు.ఈ సినిమాలో మాస్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించారు..సినిమా కథ రొటీన్ అయినా కూడా అక్కడక్కడా కామెడీని పండించారు..ముఖ్యంగా ఈ సినిమాలో చిరు నోట జంబలకడి జారుజారు మిఠాయా పాట రావడం మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Chiranjeevi
Chiranjeevi

ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా మెగా అభిమానులను బాగా అలరించింది.. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు అభిమానులు. సినిమా కూడా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫస్టాఫ్‌ రాంప్‌.. సెకండ్‌ ఆఫ్‌లో చిరు, రవితేజ ఇరగదీశారు.. అంటూ సినిమా చూస్తోన్న అభిమానులు.. ట్విట్టర్‌లో తమ రివ్యూ పోస్ట్‌ చేస్తున్నారు. సినిమా అదిరిపోయిందని.. బాస్‌ డ్యాన్స్‌, కామెడీ అన్ని అదుర్స్‌.. వాల్తేర్‌ వీరయ్య.. సూపర్‌ డూపర్‌ హిట్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు..

Walthair Veeraya
Walthair Veeraya

ఇక సినిమాలో ఓ సీన్‌లో చిరంజీవి.. జంబలకడి జారు మిఠాయి అంటూ పాడతాడు. అది చూసి ప్రేక్షకులు ఓ రేంజ్‌లో రచ్చ చేశారు. ఈ పాట మెగాస్టార్‌ను కూడా ఆకట్టుకుందా అని కామెంట్స్‌ చేస్తున్నారు. అది సోషల్‌ మీడియా పవర్‌ అంటే అంటున్నారు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో చిరంజీవి కల్లు బాటిల్ ను చేతిలో పట్టుకుని లుంగీ పైకి ఎత్తి నేను లుంగీ కట్టాను చూడు లుంగీ కట్టాను చూడు జంబలకడి జారు మిఠాయా అంటూ పాట పాడుతారు..ఆ వీడియో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను నవ్విస్తుంది..మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి..