రామబాణం ను మిస్ చేసిన మెగా హీరో ఎవరో తెలుసా?

- Advertisement -

గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ గతంలో గోపీచంద్ తీసిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం లో తెరకేక్కిన హాట్ బ్యూటీ హయాతి హీరోయిన్ నటించారు..ఇక రామబాణం సినిమా తో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గోపీచంద్ కెరీర్ లో మంచి విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు లక్ష్యం లౌక్యం. ఇక మళ్లీ ఆ సినిమాల దర్శకుడు శ్రీవాస్ తెరపైకి తీసుకువచ్చిన ఈ రామబాణం సినిమా శుక్రవారం గ్రాండ్ గాన విడుదలైంది. ఇక ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో అయితే పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు.. కానీ కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపించాయని ఇండస్ట్రీలో టాక్.. అయితే ఈ సినిమాకు మొదటగా మెగా హీరోను అనుకున్నారట ఆయన నో చెప్పడంతో గోపీచంద్ కు కథను వినిపించారని సమాచారం..

రామబాణం
రామబాణం

ఇక రామబణం సినిమాకు కొంత హైప్ క్రియేట్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే విడుదల చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 620 కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా ప్రపంచవ్యాప్తంగా 840 థియేటర్లలో ఈ సినిమా మొదటి రోజు సందడి చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద రామబాణం సినిమా 14.5 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.20 కోట్లకు సెట్ అయింది.. ప్రపంచ వ్యాప్తంగా.. 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ స్థాయిలో సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయి అని ఎవరు ఊహించలేరు. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే రామబాణం సినిమా 5 కోట్లకి అటు ఇటుగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…

ఇకపోతే సాదారణంగా అయితే ఏ దర్శకుడు అయినా కథ సిద్దం చేసుకున్నప్పుడు తన కథకు తగ్గ హీరో ఎవరో కూడా ఒక అంచనాకు వస్తారు.అలాగే శ్రీవాస్ సైతం రామబాణం కథ రెడీ చేసుకున్నాక తన సినిమాకు ఒడ్డు, పొడవు బాగా ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ ను మొదటగా అనుకున్నారట.. అనుకున్నట్టుగానే కథ మొత్తం కూడా వరుణ్ తేజ్ కి వినిపించాడట.

- Advertisement -

కానీ ఇంత ఫ్యామిలీ డ్రామ తో పాటు ఎమోషన్ తనకు అస్సలు సూట్ కావని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు వరుణ్ తేజ్. అంత హైట్ ఉన్న హీరో ఈ సినిమాకు బాగుంటాడు అనుకుంటే నో చెప్పడంతో తో అలాంటి పర్సనాలిటీ ఉన్న హీరో నే కావాలని శ్రీవాస్ చాలా ట్రై చేయగా, తనకు బాగా అచ్చొచ్చిన గోపి చంద్ మాత్రమే కరెక్ట్ అనిపించి అతడిని పెట్టి సినిమా తీశాడు.. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా సినిమా ఓ పర్వాలేదనే టాక్ ను అందుకుంది.. ఇక గోపీచంద్ కు హిట్ పడిందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here