Ram Charan : మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు, రామ్ చరణ్ కి అన్నీ చాలా తేలికగా జరిగిపోతుందని అప్పట్లో కొంతమంది విమర్శకులు అనుకునేవారు. కానీ నేడు ఆయన చిరంజీవినే మించిన స్టార్ అయ్యిపోతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.మొదటి సినిమా ‘చిరుత’ లో రామ్ చరణ్ నటన , డ్యాన్స్ మరియు ఫైట్స్ చూసి అందరూ ఆయన స్టార్ హీరో అవుతారని ఊహించారు కానీ, ఆస్కార్ అవార్డు తీసుకొచ్చేంత రేంజ్ కి ఎదుగుతాడని మాత్రం ఊహించలేదు.

అది కూడా కేవలం 14 సినిమాల వ్యవధి లోనే ఈ రేంజ్ కి ఎదిగిన స్టార్ బహుశా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఎవ్వరూ లేరు అనుకుంటా.రెండవ సినిమా ‘మగధీర’ తోనే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఎవరూ అందుకోలేని రికార్డ్స్ క్రియేట్ చేసాడు.ఈ సినిమా కలెక్షన్స్ ని దాటడానికి మన టాలీవుడ్ హీరోలకు 5 ఏళ్ళ సమయం పట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు అది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది.

రాజమౌళి అప్పటి వరకు అందరి స్టార్ హీరోలతో పని చేసాడు కానీ ఏ హీరో తో కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయలేదు ఒక్క రామ్ చరణ్ తప్ప.అప్పటి నుండే ఆయనని మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని పిలవడం ప్రారంభించారు.ఇక ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆ తర్వాత వచ్చిన యావరేజి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టాయి.
మధ్యలో రెండు ఫ్లాప్స్ వచ్చినా ఆ తర్వాత ‘రంగస్థలం’ అనే చిత్రం తో నటుడిగా తన రేంజ్ ఏంటో అందరికీ అర్థం అయ్యేలా చేసాడు,దురాభిమానుల సైతం తన నటనని మెచ్చుకునే రేంజ్ లో చేసాడు.ఇక ఆ సినిమా తర్వాత ‘వినయ విధేయ రామ’ అనే చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా 70 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఆ తర్వాత వచ్చిన #RRR గురించి చెప్పేది ఏముంది, అందరం చూసాము.

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్‘ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు తో ఒక సినిమా, ఆ తర్వాత సుకుమార్ తో మరో సినిమా, వీటితో పాటుగా బాలీవుడ్ , హాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రామ్ చరణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రాలన్నీ అనుకున్న రేంజ్ లో విజయం సాధిస్తే రామ్ చరణ్ రేంజ్ ని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ రేంజ్ కి వెళ్లాలని ఆసిస్తూ రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.