Ram Charan ‘గేమ్ చేంజెర్’ టైటిల్ వీడియో అదిరిపోయింది.. అడుగడుగున వింటేజ్ శంకర్ మార్క్

- Advertisement -

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ #RRR చిత్రం తర్వాత శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయ్యింది కానీ, ఇప్పటి వరకు సరైన అప్డేట్ లేదు.అభిమానులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.అయితే ఇన్ని రోజుల వాళ్ళ ఎదురు చూపులకు నేడు తెరపడింది.రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.

Ram Charan
Ram Charan

‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ తో అద్భుతమైన కాన్సెప్ట్ వీడియో తో విడుదల చేసిన ఈ టైటిల్ వీడియో కి ఫ్యాన్స్ నుండి అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు సరైన అప్డేట్ ఇచ్చారు అంటూ అభిమానులు సంతోషం గా ఫీల్ అవుతున్నారు.పూర్తిగా పొలిటికల్ నేపథ్యం లో కొనసాగే ఈ కథ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గెటప్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చెయ్యబోతున్నారు.ఇప్పటికే రామ్ చరణ్ లుక్ బాగా వైరల్ అయ్యింది.ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్స్ జరగడం వల్ల ఈ మూవీ కి సంబంధించిన లుక్స్ మరియు షూటింగ్ వీడియోస్ అన్ని బయటకి వచ్చేసింది.దీనితో అభిమానుల్లో అంతకు ముందు ఉన్న ఉత్సాహం మరియు ఆత్రుత ఇప్పుడు లేదు.

- Advertisement -
Ram Charan  SHankar movie

వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్న ఈ చిత్రం ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే రేంజ్ లో ఉంటుందని సమాచారం. పొలిటికల్ సబ్జక్ట్స్ తియ్యడం లో నిష్ణాతుడు అయినా శంకర్, ఈ సినిమా కోసం తనలోని వింటేజ్ యాంగిల్ ని మరోసారి బయటకి తీసినట్టు సమాచారం. ముఖ్యంగా పెద్ద రామ్ చరణ్ క్యారక్టర్ అద్భుతంగా ఉండబోతుంది అట.రామ్ చరణ్ లో మరోసారి నటవిశ్వరూపం చూడొచ్చు అని అంటున్నారు.ఈ పాత్ర కి నత్తి ఉంటుందట, రెండు డిఫరెంట్ షేడ్స్ లో ఈ క్యారక్టర్ ని డిజైన్ చేసినట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here