JR NTR ముప్పై రెండో సినిమా డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!

- Advertisement -

JR NTR : ట్రిపుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాకు ఆస్కార్ రావడంతో ఇప్పుడు అతని రేంజ్ పెరిగింది.. ఆ తర్వాత ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడు అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తుంది.ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలతో సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే..పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజిఎఫ్, సలార్ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనుంది.. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి..

jr ntr
jr ntr

ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ 32 వ సినిమాపై కూడా క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ వస్తుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో నెక్స్ట్ సినిమాలన్నింటిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో కేవలం టాలీవుడ్ నిర్మాతలే కాదు..ఎన్టీఆర్ తో సినిమాలు చెయ్యడానికి బాలివుడ్ డైరెక్టర్స్, నిర్మాతలు పోటీ పడుతున్నారు..

అయితే ఎన్టీఆర్ 32వ సినిమాను ప్రముఖ బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమా ప్రారంభోత్సవానికి భూషణ్ కుమార్ ముంబై నుంచి హైదరాబాద్ కు ప్రత్యేకంగా వచ్చారు. మరోవైపు ఆయన ప్రభాస్, అల్లు అర్జున్ లతో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో కూడా స్టార్ డైరెక్టర్ సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పారని టాక్..బాలివుడ్ డైరెక్టర్ దీన్ని తెరకేక్కించునున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి..దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.. మరి ఎన్టీఆర్ ముప్పై రెండో సినిమా ఎవరితో ఉంటుందోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here