Ram Charan New Look : రామ్‍చరణ్ కొత్త లుక్ లీక్.. గేమ్ ఛేంజర్‌ నుంచే నండోయ్‌

- Advertisement -

Ram Charan New Look : హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతోంది. ఈ సినిమా మొదలై రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తమిళ సీనియర్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరుగుతోంది. అయితే ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ సినిమాకు మరోసారి లీకుల ముప్పు ఎదురైంది. వైజాగ్‌లోని గేమ్ ఛేంజర్ సెట్స్ నుండి రామ్ చరణ్ కొన్ని ఫోటోలు ఇటీవల లీక్ అయ్యాయి. వీటి ద్వారా ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త లుక్ రివీల్ అయింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తిగా క్లీన్ షేవ్, మీసాలతో, రామ్ చరణ్ ఈ కొత్త లుక్‌లో అదరగొడుతున్నాడు. స్పెక్ట్స్ వేసుకుని సూపర్ క్లాస్ గా కనిపిస్తున్నారు. ఆ సినిమాలో రాజకీయ పార్టీ మీటింగ్ సందర్భంగా చెర్రీ ఈ లుక్‌లో కనిపిస్తాడని అంటున్నారు. సెట్స్ నుంచి చరణ్ కు సంబంధించిన మరో వీడియో కూడా లీక్ అయింది. చెర్రీ అదే లుక్‌లో గాగుల్స్ ధరించి మెట్లు దిగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో చరణ్‌ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. కొడుకు పాత్రలో కలెక్టర్‌గా కనిపించనున్నాడు. అందుకే.. ఫార్మల్ వేర్‌లో అదిరిపోయే లుక్‌లో సూప‌ర్ గా ఉన్నాడు చరణ్.

కాగా.. షూటింగ్ స్పాట్ నుంచి ఇలాంటి లీకుల వల్ల సినిమా పై ఎఫెక్ట్ తప్పదనే చెప్పాలి. ఈ లీకులు అంచనాలు పెంచేలా ఉన్నప్పటికీ.. అసలు మ్యాటర్ తెలిసిపోవడంతో కాస్త ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కావున‌ మేకర్స్ లీకులను కంట్రోల్ చేస్తే బెటర్. రామ్ చరణ్ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని అభిమానులు, నెటిజన్లు షేర్ చేస్తున్నారు. చెర్రీ కొత్త లుక్‌తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాపై హైప్ పెరిగింది. గేమ్ ఛేంజర్ సినిమాలోని మొదటి పాట రెడీ అవుతోంది. ఈ చిత్రంలోని మొదటి పాటను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజుతో పాటు సంగీత దర్శకుడు థమన్ కూడా చెప్పాడు. దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీని కూడా చిత్రబృందం వెల్లడించే అవకాశం ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here