Ram charan : ఏం క్రేజ్ సామీ.. బాబాయ్ గుర్తొస్తున్నాడు.. రామ్ చరణ్ ఎంట్రీ కి దద్దరిల్లిన USA థియేటర్స్

- Advertisement -

Ram charan : పాన్ వరల్డ్ రేంజ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.#RRR మూవీ విడుదలై దాదాపుగా ఏడాది కావొస్తుంది, డిజిటల్ స్ట్రీమింగ్ తర్వాత ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది, అవార్డులు కూడా లభిస్తున్నాయి.12 వ తేదీ అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా దక్కనుంది.ఇలా తెలుగోడి సత్తాని ప్రపంచ నలుమూలల విస్తరింపజేసిన రాజమౌళి ఎంత మంచి పేరు వచ్చిందో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా అదే రేంజ్ క్రేజ్ వచ్చింది.

Ram charan with oscar award
Ram charan with oscar award

హాలీవుడ్ ఆడియన్స్ మనోడి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా ఐపోతున్నారు.అవతార్ సిరీస్ మరియు టైటానిక్ వంటి అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కెమరూన్ వంటి వారే రామ్ చరణ్ నటనకి ఫిదా అయ్యారంటే ఇక అమెరికన్ ఆడియన్స్ ఆయనకీ ఫ్లాట్ అవ్వడం లో ఆశ్చర్యం ఏముంది..? మార్చి 12 వ తేదీన ఈ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న #RRR మూవీ కి అవార్డు దక్కుతుందా లేదా అనేది తెలియనుంది.

Ram charan in America

ఈ నేపథ్యం లో ఆస్కార్ ప్రొమోషన్స్ కోసం #RRR మూవీ ని మరోసారి అమెరికన్ థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.రెస్పాన్స్ అదిరిపోయింది.థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కిక్కిరిసిపోయాయి.నిన్న అమెరికా లోని ఎస్ హోటల్ అనే థియేటర్ లో #RRR మూవీ స్పెషల్ స్క్రీనింగ్ చూసేందుకు #RRR మూవీ టీం మొత్తం హాజరైంది.రాజమౌళి , కీరవాణి తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ షో లో పాల్గొన్నాడు.

- Advertisement -
Rajamouli Ram charan

ఆయన ఎంట్రీ ఇవ్వగానే థియేటర్ మొత్తం ఆడియన్స్ విజిల్స్ మరియు క్లాప్స్ తో దద్దరిల్లిపోయింది.ఇది మన తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ కాదు,లోకల్ గా ఉండే అమెరికన్స్ రెస్పాన్స్.అక్కడ మనోడికి వచ్చిన రెస్పాన్స్ ని చూసి రాజమౌళి సైతం షాక్ కి గురయ్యాడు.ఆ వీడియో విజువల్స్ మీరు కూడా చూసేయండి..మరి ఇంతలా గుర్తింపు దక్కించుకున్న ఈ చిత్రానికి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ‘నాటు నాటు‘ కి ఆస్కార్ అవార్డు దక్కుతుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here