Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చెర్రీ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అంత పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా బాబాయి పవన్ కళ్యాణ్ మాదిరి సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తుంటారు. ఆయన సింప్లిసిటీతో ఎక్కడికి వెళ్లినా హైలైట్ గా నిలుస్తూ ఉంటాడు. మెగాస్టార్ వారసుడిగా అడుగుపెట్టి.. తండ్రికి మించిన తనయుడిగా పాపులారిటీ దక్కించుకున్నాడు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్, ఉపాసనలు లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన వీరిద్దరూ కలిసి వెళ్లి వస్తూ ఉంటారు. ఉపాసనకు.. రాంచరణ్ అంటే ఎంత ప్రేమో.. రాంచరణ్ కు కూడా ఉపాసన అంటే అంతే ప్రేమ. వీరిద్దరూ వారి మధ్య ప్రేమను తరచూ వ్యక్తం చేసుకుంటూనే ఉంటారు.

ఇక ఉపాసన ఎంట్రీ తో చరణ్ లైఫ్ స్టైల్‌లో చాలా మార్పులు జరిగాయి. పాజిటివిటీ కూడా ఎక్కువైందట. ఇక తాజాగా అనిల్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు చరణ్.. ఉపాసనతో కలిసి స్పెషల్ చాపర్ లో వెళ్లారు. అందులో అలసిపోయి రిలాక్స్ అవుతున్న ఉపాసన పాదాలను నొక్కుతూ రామ్ చరణ్ ఆమెకు సేవలు చేస్తున్నాడు. ప్రశ్న ఆ వీడియో వైరల్ అవడంతో ఉపాసన చాలా లక్కీ అని.. ఇంత మంచి పర్సన్ ఆమెకు హస్బెండ్ గా దొరకడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక భర్త నుంచి ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఇలాంటి ప్రేమే అని.. ఉపాసన విషయంలో ఇది నిజమైందంటూ వారి అభిమానులు ఆ వీడియోను లైక్ చేస్తూ షేర్ చేసి మరీ ప్రశంసిస్తున్నారు.

ఇక అంతో ఇంతో చరణ్ పై ఉన్న హేటర్స్ కూడా ఈ వీడియోతో వారి అభిమానులుగా మారిపోతున్నారు. వీడియో కింద పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కపుల్ గోల్స్ లో బెస్ట్ హస్బెండ్ ఉండాల్సిన లక్షణాలన్నీ రామ్ చరణ్ లో ఉన్నాయంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. బయట ఎంత పెద్ద గొప్ప హీరో అయినా సరే.. భార్య విషయంలో తన ప్రేమను, సేవను అందించి ఆమె కష్టాన్ని అర్థం చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదని.. ఇది నిజంగానే చెర్రీ గొప్పతనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.