Allu Arjun : భారత సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. తెలుగు సినీ రంగంలో అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. గంగోత్రి మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఆర్య లాంటి సినిమాలతో క్రేజ్ దక్కించుకున్నాడు. ఇండస్ట్రీలో స్టైలిష్ డ్యాన్స్ తో ఓ ఊపు ఊపేస్తున్నాడు. ఆయన డాన్స్ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. అల్లు అర్జున్, స్నేహ రెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమకి గుర్తుగా అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి మాత్రం తప్పనిసరిగా టైం కేటాయిస్తాడు. ఫ్యామిలీతో చాలా సరదగా గడుపుతాడు. ముఖ్యంగా తన కూతురు అయాన్, అర్హతో ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ, వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు.
తాజాగా అల్లు అయాన్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. అల్లు అయాన్ మెడలో కుర్తి తో మోడలింగ్ చేస్తూ కనిపించాడు. ఇక ఈ మధ్య అయాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడని, ముఖ్యంగా పుష్ప 2లో అతడు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. ఇలా అయాన్‌కు సంబంధించిన చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అయాన్‌కు సంబందించిన ఓ వీడియోను అల్లు అర్జున్ పోస్ట్ చేయగా అది వేగంగా ట్రెండ్ అవుతుంది. అందులో సామ్ జామ్ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ అయాన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన గురించి చెప్పాడు.
ఆయన మాట్లాడుతూ.. ఒకసారి అయాన్ అల్లరి చేస్తే చెయ్యి ఎత్తాను. దీంతో అయాన్ సీరియస్‌గా చూస్తూ.. నన్ను కొట్టాలని చూస్తున్నావా? అమెరికాలో పిల్లలను కొడితే, పోలీసులకు ఫోన్ చేస్తారని తెలుసా? అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా షాకైన నేను అదేం లేదురా బాబు, నేను ఏదో సరదాగా అన్నానంటూ చెప్పుకొచ్చానని తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అల్లు అర్జున్ పోస్ట్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.